మేం చనిపోలేదు.. వైజాగ్ లో ఓటు తీసేయడంపై యాంకర్ రష్మి ఫైర్!

-

ఏపిలో జరుగుతున్న అసెంబ్లీ, లోక్ సభ ఎలక్షన్స్ లో భాగంగా టాలీవుడ్ సెలబ్రిటీస్ కూడా తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అయితే జబర్దస్త్ యాంకర్ రష్మికి మాత్రం చేదు అనుభవం ఎదురైంది. వైజాగ్ లో ఓటర్ కార్డ్ ఉన్నా సరే తన పేరు లిస్ట్ లో లేదని నానా హంగామా చేసింది రష్మి. తామేం చనిపోలేదుగా తన పేరు.. తన తల్లి పేరు ఓటరు లిస్ట్ లో లేకపోవడంపై రష్మి గొడవ పెట్టుకుంది.

తమ అడ్రెస్ ఏమి మారలేదని.. ఇంటికి ట్యాక్స్ కూడా కరెక్ట్ గా పే చేస్తున్నామని.. ప్రతిసారి ఓటు హక్కు వినియోగించుకుంటున్నా తమ పేరు ఓటర్ లిస్ట్ లో ఎందుకు లేదని ఫైర్ అయ్యింది రష్మి గౌతం. ఓటింగ్ రోజు వచ్చి స్లిప్స్ గురించి గొడవ చేస్తే ఎలా అంటూ రష్మిపై రివర్స్ లో కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్లు. ఫైనల్ గా ఆమె స్లిప్ దొరకగా.. తన తల్లిది మాత్రం దొరకలేదట. ఇలానే చాలామంది ఓటర్ల పేరు లిస్ట్ లో లేదని రష్మి ట్వీట్ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news