కర్నులులో స్ట్రీట్ వార్.. రాళ్లు, కర్రలతో కొట్టుకున్న వైసీపీ, టీడీపీ కార్యకర్తలు

-

ఏపీలో జరుగుతున్న ఎన్నికల్లో చాలా ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. కర్నూలు జిల్లాలో పోలింగ్ సందర్భంగా వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో ఇరు వర్గాల కార్యకర్తలు కర్రలు, రాళ్లతో విచక్షణారహితంగా కొట్టుకున్నారు. అహోబిలంలో పోలింగ్ బూత్ వద్ద ఈ ఘటన చోటు చేసుకున్నది.

పోలింగ్ బూత్ లోకి వెళ్తున్న సమయంలో ఇరు వర్గల నేతలు కొట్టుకున్నారు. ఓవైపు భూమా, మరోవైపు గంగుల వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకున్నది. దీంతో ఇరువర్గాలు రాళ్లు, కర్రలతో దాడి చేసుకున్నారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. ఇరు వర్గాలకు సర్ది చెప్పి అక్కడి నుంచి పంపించివేశారు.



ఈ విషయం తెలుసుకున్న మంత్రి అఖిల ప్రియ తన అనుచరులతో కలిసి ఘటనా స్థలానికి చేరుకునే సరికి పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. టీడీపీ శ్రేణులపై దాడికి పాల్పడ్డ వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. అయితే.. ఆమెకు సర్ది చెప్పి పోలీస్ అధికారులు అమెను అక్కడి నుంచి పంపించివేశారు.

Read more RELATED
Recommended to you

Latest news