రౌడీ మ‌ద‌ర్ బ‌ర్త్‌డే పార్టీలో ర‌ష్మిక‌!

-

టాలీవుడ్ ట్రెండ్ సెట్ట‌ర్ విజ‌య్ దేవ‌ర‌కొండ మ‌ద‌ర్ మాధ‌వి త‌న 50వ పుట్టిన రోజుని గురువారం జ‌రుపుకున్నారు. ఈ వేడుక‌లో ఫ్యామిలీ మెంబ‌ర్ మాత్ర‌మే పాల్గొన్నారు. విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో పాటు ఆనంద్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌, విజ‌య్ ఫాద‌ర్ తో పాటు స‌న్న‌హిత కుటుంబ స‌భ్యులు పాల్గొన్నారు. బ‌ర్త్‌డే సంద‌ర్భంగా విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ఆనంద్ దేవ‌ర కొండ అటు ఇటు వుండ‌గా త‌ల్లి మాధ‌వి 50 పూర్తి చేశాన‌ని సింబాలిక్‌గా క్రికెట్ బ్యాట్ ని హిట్ చేసిన వీడియోని సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్‌లో అభిమానుల‌తో పంచుకున్నారు.

ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్గా మారింది. రౌడీ హీరో ఫ్యాన్స్ ఈ వీడియోని వైర‌ల్ చేస్తున్నారు. అయితే విజ‌య్ దేవ‌ర‌కొండ మ‌ద‌ర్ మాధ‌వి బ‌ర్త్‌డే కార్య‌క్ర‌మంలో ఫ్యామిలీ మెంబ‌ర్స్ మాత్ర‌మే పాల్గొన్నారు. అయితే వీరితో పాటు క్రేజీ హీరోయిన్ ర‌ష్మిక కూడా పాల్గొన‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. గ‌తంలో వీరిద్దిరిపై రూమ‌ర్‌లు వినిపించిన విష‌యం తెలిసిందే. తాజాగా ర‌ష్మిక బ‌ర్త్‌డే కార్య‌క్ర‌మంలో పాల్గొన‌డంతో సోష‌ల్ మీడియాలో మ‌ళ్లీ గుస‌గుస‌లు మొద‌ల‌య్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news