బెంగుళూరు అల్లర్ల కేసులో సూత్రధారి అయిన సయ్యద్ సాదిక్ అలీని ఎన్ ఐ ఎ అరెస్ట్ చేసింది. ఆగస్టు 11న డీజే హాలి, కేజీ హాలీ పోలీస్ స్టేషన్ల పై దాడిలతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తి ఇంటి మీద అల్లరి మూకల విధ్వంసం కేసుని ఎన్ ఐ ఏ తీసుకున్న సంగతి తెలిసిందే. తమ పరిధిలోకి వచ్చిన వెంటనే ఈ దాడి వెనకాల ఉన్న సయ్యద్ సాదిక్ అలీ ని ఎన్ ఐ ఎ అరెస్ట్ చేసింది.
బెంగళూరులో ఓ బ్యాంకులో సయ్యద్ సాదిక్ అలీ రికవరీ ఏజెంట్ గా పనిచేస్తున్నట్టు గుర్తించారు. ఆగస్టు 11 అల్లర్లు తర్వాత సయ్యద్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కేంద్ర హోం శాఖ ఆదేశాలతో తాజాగా సెప్టెంబర్ 21న బెంగళూరు అల్లర్ల పై ఎన్ ఐ ఎ కేసు నమోదు చేసింది. ఈరోజు బెంగళూరులో 30 చోట్ల సోదాలు నిర్వహించిన ఎన్ ఐ ఏ సోదాల్లో ఎయిర్ గన్, షార్ప్ ఆయుధాల తో పాటు, ఐరన్ రాడ్స్, ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకుంది ఎన్ ఐఎ.