‘కిర్రాక్ పార్టీ’తో సినిమా ఇండస్ట్రీలో అరంగేట్రం చేసి ఛలోతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది రష్మిక మందన్న. ఆ తర్వాత వరుస అవకాశాలతో స్టార్ హీరోలతో నటించే ఛాన్స్ కొట్టేసింది. తక్కువ కాలంలోనే నేషనల్ క్రష్ గా పేరు తెచ్చుకుని స్టార్ డమ్ సంపాదించుకుంది. ఇక టాలీవుడ్ లో స్టారడమ్ వచ్చిన తర్వాత ఈ బ్యూటీకీ బాలీవుడ్ లో అవకాశాలు రావడం మొదలయ్యాయి. అలా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ రష్మిక తన హవా సాగిస్తోంది. తన హిట్ మూవీస్ తో రికార్డులు బ్రేక్ చేస్తోంది. పుష్ప, యానిమల్ వంటి బ్లాక్ బస్టర్ హిట్లు తన ఖాతాలో వేసుకున్న రష్మిక పుట్టిన రోజు ఇవాళ. ఈ సందర్భంగా ఈ బ్యూటీ గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందామా
ఇటీవల టోక్యోలో జరిగిన క్రంచీ రోల్ అనిమే అవార్డులకు రష్మిక హాజరైంది. భారతదేశం నుంచి ఈ అవార్డు వేడుకకు హాజరైన తొలి సెలబ్రిటీ రష్మిక కావడం విశేషం.
రష్మిక ఇటీవల జపాన్‌కు చెందిన ఒనిట్సుకా టైగర్ ఫ్యాషన్ సంస్థకు ‘బ్రాండ్ అడ్వకేట్’గా వ్యవహరిస్తోంది. ఆ సంస్థకు బ్రాండ్ అడ్వకేట్‌గా నియమితులైన ఫస్ట్ భారతీయురాలు తనే.
ఈ ఏడాది ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకటించిన ‘ఫోర్బ్స్ ఇండియా 30 అండర్ 30’ జాబితాలోనూ రష్మిక స్థానం సంపాదించుకుంది. ఇందులో రష్మిక అగ్రస్థానంలో నిలిచింది.
నెదర్లాండ్స్‌కు చెందిన సెప్టిమిస్ అవార్డ్స్ నామినేషన్స్‌లో నిలిచింది. బెస్ట్ ఏషియన్ యాక్ట్రెస్ నామినేషన్స్‌లో ఇండియా నుంచి మన రష్మిక మందన్న నిలిచింది.
ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రష్మికకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. 43 మిలియన్ల మందితో అత్యధిక ఫాలోవర్స్ కలిగిన హీరోయిన్స్‌లో ఒకరిగా , ముఖ్యంగా టాలీవుడ్‌లో ఈ మార్క్‌ను చేరుకున్న తొలి హీరోయిన్‌గానూ క్రేజ్ దక్కించుకుంది.
ఇక మొదటి సినిమాలోనే తన నటనకు గాను ఉత్తమ నటిగా సైమా అవార్డును సొంతం చేసుకుంది రష్మిక. ఇప్పటి వరకు ఇదే జాబితాలో ఆమె తొమ్మిది సార్లు అవార్డు అందుకుంది.