Ravanasura : రావణాసుర ట్రైలర్‌ కు ముహుర్తం ఖరారు

-

టాలీవుడ్‌ మాస్‌ మహారాజ్‌ రవితేజ..వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే 3 సినిమాలను లైన్‌ లో పెట్టారు ఈ మాస్‌ మహారాజు. ఇక ప్రస్తుతం సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా” రావణాసుర” అనే చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రం శర వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.తాజాగా ఈ చిత్రం షెడ్యూల్ షూటింగ్ పూర్తయింది.

ఈ సినిమాలో రవితేజ సరసన ఏకంగా 5 గురు హీరోయిన్లు నటిస్తున్నారు. అనూ ఇమ్మాన్యూయేల్, మేఘా ఆకాష్, ఫరీయా అబ్దుల్లా, దీక్షా నగార్కర్, పూజిత పొన్నాడ నటించారు. ఈ చిత్రంలో రవితేజ లాయర్ పాత్రలో కనిపించబోతున్నాడు. హీరో సుశాంత్ ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నాడు. అయితే, తాజాగా రావణాసుర ట్రైలర్‌ రిలీజ్‌ కు ముహుర్తం ఫిక్స్‌ అయింది. ఈ మూవీ ట్రైలర్ ను ఈ నెల 28వ తేదీన సాయంత్రం 4.05 గంటలకు రిలీజ్‌ కానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది చిత్ర బృందం.

Read more RELATED
Recommended to you

Latest news