ముగింపు రాసుకున్న తర్వాతే కథ మొదలు పెట్టాలి.. ‘అమర్ అక్బర్ ఆంటొని’ టీజర్!

-

రవితేజ… ఎనర్జిటిక్ స్టార్. చిన్న చిన్న పాత్రల్లో మెప్పించి.. ఆ తర్వాత స్టార్ హీరోగా ఎదిగాడు. ఇండస్ట్రీలో ఎవరి సపోర్ట్ లేకున్నా.. తన టాలెంట్ తో పైకెదిగాడు. ఎన్నో హిట్ చిత్రాల్లో నటించాడు. సినీ అభిమానులను మెప్పించాడు. తాజాగా ఆయన నటిస్తున్న అమర్ అక్బర్ ఆంటొని సినిమా టీజర్ ను మూవీ యూనిట్ ఇవాళ రిలీజ్ చేసింది. ఇలియాన ఈ సినిమాలో హీరోయిన్. రవితేజ ఈ సినిమాలో త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. అమర్, అక్బర్, ఆంటొనిగా మూడు పాత్రల్లో సినీ అభిమానులను మెప్పించనున్నాడు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 16 న రిలీజ్ కానుంది. కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కమెడియన్ కమ్ హీరో సునిల్ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడు. తమన్ మ్యూజిక్ డైరెక్టర్, శ్రీను వైట్ల డైరెక్టర్. ఇక్కడ చెప్పుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. అటు రవితేజ, ఇటు శ్రీను వైట్ల.. ఇద్దరు డిజాస్టర్లతో సతమతమవుతున్నారు. ఇప్పుడు ఈ సినిమా హిట్టయితే ఇద్దరు మళ్లీ ట్రాక్ లో పడ్డట్టే. చూద్దాం.. మరి అమర్, అక్బర్, ఆంటొనీలు సినీ అభిమానులను ఏమేరకు ఆకట్టుకుంటారో.

టీజర్ మాత్రం అదిరిపోయింది. టీజర్ ప్రారంభమే… ముగింపు రాసుకున్న తర్వాతే కథ మొదలు పెట్టాలనే డైలాగ్ రావడం… తర్వాత రవితేజ చెప్పిన మరో డైలాగ్ కూడా సూపర్. మనకు నిజమైన ఆపద వచ్చినప్పుడు మనల్ని కాపాడేది మన చుట్టూ ఉన్న బలగం కాదు మనలో ఉన్న బలం.. లాంటి డైలాగులు సినిమా రిచ్ నెస్ ను పెంచాయి.

Read more RELATED
Recommended to you

Latest news