అమర్ అక్బర్ ఆంటోనీ ఫస్ట్ టాక్

-

మాస్ మహరాజ్ రవితేజ, శ్రీను వైట్ల కాంబినేషన్ లో వచ్చిన సినిమా అమర్ అక్బర్ ఆంటోనీ. నీకోసం, వెంకీ, దుబాయ్ శీను సినిమాల తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన క్రేజీ మూవీ ఇది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఆల్రెడీ యూఎస్ లో ప్రీమియర్స్ పడగా సినిమా టాక్ బయటకు వచ్చేసింది.

అమర్ అక్బర్ ఆంటోనీ ఓ రివెంజ్ డ్రామాగా తెరకెక్కించాడట శ్రీను వైట్ల. రొటీన్ కథగా అనిపిస్తున్నా శ్రీను వైట్ల డైరక్షన్ టాలెంట్ మెప్పించిందని అంటున్నారు. కొన్నాళ్లుగా సరైన సక్సెస్ లేని శ్రీను వైట్ల రవితేజతో హిట్ ట్రాక్ ఎక్కినట్టే అంటున్నారు. సినిమాలో రవితేజ చేసిన మూడు పాత్రలు హైలెట్ అని తెలుస్తుంది.

ఇక హీరోయిన్ గా నటించిన ఇలియానా కూడా సినిమాకు ప్లస్ అయ్యిందని టాక్. ముఖ్యంగా ఈ సినిమాకు ఇలియానా సొంత డబ్బింగ్ చెప్పడం విశేషం. మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్ వాల్యూస్ వంక పెట్టని విధంగా ఉన్నాయట. సినిమా అంతా ఎంటర్టైనింగ్ గా సాగుతూ మాస్ రాజా ఫ్యాన్స్ ను ఖుషి చేసే యాక్షన్ సీన్స్ ఉన్నాయని చెబుతున్నారు. నేల టిక్కెట్టు డిజాస్టర్ కావడంతో అమర్ అక్బర్ ఆంటోనీ మీద చాలా హోప్స్ పెట్టుకున్నాడు రవితేజ.

శ్రీను వైట్ల, రవితేజ కాంబినేషన్ ఇదవరకు సినిమాల్లానే అమర్ అక్బర్ ఆంటోనీ హిట్ కొడుతుందో లేదో చూడాలి. సునీల్, రఘుబాబు, వెన్నెల కిశోర్, సత్య కమెడియన్స్ తో వాటా (ఓల్ ఆంధ్రా తెలంగాణా అసోషియేషన్) అంటూ చేయించిన కామెడీ బాగానే వర్క్ అవుట్ అయినట్టు టాక్. మరి అసలు టాక్ ఏంటన్నది మరికొద్దిసేపట్లో తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version