దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ‘బాహుబలి’ వంటి భారీ స్థాయి విజయం తర్వాత తెరకెక్కుతున్న సినిమా RRR. ఈ సినిమాకి సంబంధించి ముందునుండి ప్లానింగ్ చేస్తున్నా ఏది కూడా వర్క్ ఔట్ కావడం లేదు. సినిమా స్టార్ట్ చేసిన సందర్భంలో మీడియా సమావేశం పెట్టి ఈ యేడాది జూన్ నెల చివరన సినిమా రిలీజ్ చేస్తున్నట్లు రాజమౌళి డేట్ ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత వెంటనే రాజమౌళి ఈ సినిమా ఈ ఏడాది కాదు వచ్చే సంవత్సరం సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు డేట్ మార్చారు.
ఈ ప్రకటనతో నందమూరి మరియు మెగా అభిమానులలో కొంత నిరుత్సాహం సినిమాపై నెలకొంది. అయితే రాను రాను ఈ సినిమాకి సంబంధించి సరైన అప్ డేట్ ఏదీ కూడా రిలీజ్ చేయకుండా మరియు అదే విధంగా టైటిల్ విషయంలో సరైన క్లారిటీ రాజమౌళి ఇవ్వకపోవటంతో సోషల్ మీడియాలో ఈ సినిమా ప్లాప్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
ప్రతిసారి ఈ సినిమా గురించి మాట్లాడాల్సిన సందర్భంలో RRR అనే టైటిల్ సినిమా ప్రేక్షకులలో బాగా నాటుకుపోయింది. ఇటువంటి టైం లో ఈ సినిమాకి సంబంధించి కొత్త టైటిల్ ప్రకటిస్తే అది సినిమా ప్రేక్షకుల లోకి రీచ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది ఇప్పుడైనా ఏదైనా క్యాచీ టైటిల్ ప్రకటిస్తే అన్నీవర్గాల వారికి అది చేరువ అయ్యే అవకాశాలు కనిపిస్తుందని అభిప్రాయాలు సోషల్ మీడియాలో వినబడుతున్నాయి. ఇప్పటివరకు టైటిల్ విషయంలో రాజమౌళి క్లారిటీ లేకపోవటమే ప్లాప్ అవ్వడానికి ఇదొక్క కారణం చాలు అని చాలా మంది నెటిజన్లు అంటున్నారు.