తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో గా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమా ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఈ సినిమాతో ఓవర్నైట్ లోనే నేషనల్ స్టార్ హీరో గా చలామణి అవుతూ.. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకోవడం గమనార్హం. ఇక ప్రభాస్ కు నేషనల్ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ కూడా అన్నీ పాన్ ఇండియా సినిమాలను మాత్రమే చేయాలని ఒక్కో సినిమాకు రూ.300 కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మించే సినిమాలలో మాత్రమే ప్రభాస్ నటిస్తున్నారు. ఈయన సినిమాలు కథ పరంగా పరాజయం పొందినప్పటికీ కమర్షియల్ పరంగా విజయాలను సాధిస్తూ ఉంటాయి.
ఇక ప్రభాస్ ఇటీవల రాధే శ్యామ్ సినిమా ద్వారా తాజాగా డిజాస్టర్ ను మూటగట్టుకున్నప్పటికీ.. మళ్లీ వరుస క్రేజీ ప్రాజెక్ట్ లను తన చేతిలో పెట్టుకున్నారు. అలా ఆదిపురుష్, ప్రాజెక్ట్ కె , స్పిరిట్ వంటి వరుస సినిమాలు చేస్తూ తనదైన శైలిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ప్రస్తుతం ఈ మూడు సినిమాల షూటింగ్ లో బిజీగా ఉన్నారు ప్రభాస్. ఇదిలా ఉండగా ప్రస్తుతం ప్రభాస్ ఒక్కో సినిమాకు రూ.100 కోట్ల నుంచి రూ.150 కోట్ల వరకూ పారితోషకం తీసుకుంటున్నారు అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ రేంజ్లో పారితోషికం అందుకుంటున్న ఆయన తన మొదటి సినిమాకు ఎంత తీసుకునేవారు అనే విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
2002 లో ప్రముఖ దర్శకుడు జయంత్.సి దర్శకత్వంలో తెరకెక్కిన ఈశ్వర్ సినిమా ద్వారా రెబల్ స్టార్ కృష్ణం రాజు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు ప్రభాస్. ఈ సినిమా ద్వారా ప్రభాస్ కేవలం రూ.5 లక్షల రూపాయలను మాత్రమే పారితోషికంగా తీసుకోవడం గమనార్హం. ఇకపోతే రూ.5 లక్షల పారితోషికం తీసుకునే స్థాయి నుండి ఏకంగా రూ. 150 కోట్లు పారితోషికం తీసుకునే స్థాయికి ప్రభాస్ చేరుకున్నారు అంటే ఆయన క్రేజ్ ఎంత ఉందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.