బ‌న్నీ హాఫ్ బిలియ‌న్‌పై క‌న్నశాడు!

-

స్టైలిష్ స్టార్ బ‌న్నీ ఏకంగా హాఫ్ బిలియ‌న్ రికార్డుపై క‌న్నేశాడు. అల్లు అర్జున్ న‌టించిన చిత్రం `అల వైకుంఠ‌పుర‌ములో`. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ తెర‌కెక్కించిన ఈ చిత్రం ఈ ఏడాది ప్రారంభంలో సంక్రాంతి బ‌రిలో నిలిచి ఇండ‌స్ట్రీ హిట్ గా రికార్డు సృష్టించింది. బ‌న్నీ మార్కెట్ స్థాయిని పెంచింది. సినిమాతో పాటు ఈ చిత్రానికి త‌మ‌న్ అందించిన గీతాలు కూడా రికార్డ్ స్థాయిలో ప్రేక్ష‌కుల్ని ఉర్రూత‌లూగిస్తున్నాయి.

ఈ చిత్రంలోని `సామ‌జ‌వ‌ర గ‌మ‌న‌… తొలిసారి 100 మిలియ‌న్ వ్యూస్‌ని దాటి సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే. ఆ త‌రువాత ఈ మూవీలోని పాట‌లు 200 టు 300 మిలియ‌న్ వ్యూస్ రికార్డుని సాధించాయి. తాజాగా ఈ చిత్రంలో `బుట్ట‌బొమ్మా.. బుట్ట‌బొమ్మా.. సాంగ్ 400 మిలియ‌న్ వ్యూస్‌ని క్రాస్ చేసి సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోంది.  ఈ స్థాయిలో వ్యూస్‌ని తెలుగు సినిమా పాట‌గా రికార్డు సాధించింది. కేవ‌లం ప‌ది నెల‌ల వ్య‌వ‌ధిలోనే ఈ ఫీట్‌ని సాధించిన తెలుగు చిత్రంగా `అల వైకుంఠ‌పుర‌ములో` నిల‌వ‌డంతో ఈ పాట‌తో బ‌న్నీ హాఫ్ బిలియ‌న్ వ్యూస్‌పై క‌న్నేశాడ‌ని నెటిజ‌న్స్ కామెంట్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news