రికార్డ్ ప్రైజ్ లో అరవింద సమేత శాటిలైట్స్..!

-

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రం కలిసి చేస్తున్న మూవీ అరవింద సమేత వీర రాఘవ. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ అదరగొడుతుంది. ఇప్పటికే తెలుగు రెండు రాష్ట్రాల్లోనే 80 కోట్ల దాకా బిజినెస్ జరిగినట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమా శాటిలైట్ రైట్స్ తో కూడా సంచలనం సృష్టించింది.

స్టార్ సినిమాల శాటిలైట్ రైట్స్ కోసం ఛానెల్స్ పోటీ తెలిసిందే. స్టార్ మా, జీ తెలుగు, జెమిని ఈ మూడు ఛానెల్స్ మధ్య గట్టి పోటీ ఏర్పడుతుంది. ప్రతి సినిమా ఎవరు సొంతం చేసుకుంటారా అన్న ఎక్సైట్మెంట్ కూడా ఉంటుంది. కొన్నాళ్లుగా స్టార్ మా స్టార్ సినిమాలన్నిటిని సొంతం చేసుకుంటుంది. లేటెస్ట్ గా అరవింద సమేత మాత్రం జీ తెలుగు సొంతం చేసుకుందట.

23.5 కోట్ల రేటు కట్టి మరి జీ తెలుగు ఈ సినిమా శాటిలైట్ రైట్స్ సొంతం చేసుకున్నారని తెలుస్తుంది. తెలుగు సినిమాల్లో ఈ రేంజ్ శాటిలైట్ రైట్స్ రాబట్టడం మాములు విషయం కాదు. త్రివిక్రం, తారక్ కాంబినేషన్ పై ఉన్న అంచనాలకు తగినట్టు ఈ సినిమా వస్తుంది. మరి బిజినెస్ రేంజ్ ను బట్టి కలక్షన్స్ లో కూడా ఆ హవా కొనసాగిస్తుందో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news