తెలంగాణ రాష్ట్రానికి ఇవాళ, రేపు భారీ వర్షాలు ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఉత్తర బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఇది రాగల 24 గంటల్లో ఒడిస్సా మరియు ఛత్తీస్ ఘడ్ మీదుగా కదిలే అవకాశం ఉందని పేర్కొన్నారు అధికారులు. తీవ్ర అల్పపీడనం కారణంగా రాష్ట్రాలొ ఈ రోజు అక్కడక్కడా భారీ వర్ష సూచనలు ఉన్నాయని… అలాగే.. 6 జిల్లాల్లో భారీ వర్షాల తో ఎల్లో అలెర్ట్స్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు.
తెలంగాణ రాష్ట్రంలోని అదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలో ఇవాళ, రేపు అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రాగల రెండు రోజులు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసారు. ఈ రోజు రేపు తెలంగాణ రాష్ట్రములో ఉరుములు,మెరుపులతో కూడిన వర్షాలు… అక్కడక్కడ కొన్ని తూర్పు, ఉత్తర తెలంగాణ జిల్లాలలో వచ్చే అవకాశం ఉంది.
అటు హైదరాబాద్ నగరానికి ఈరోజు తెరికపాటి నుంచి మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.