పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఈమధ్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. పవన్ నుండి విడిపోయాక కొన్నాళ్లుగా పూణెలో ఉంటున్న రేణు దేశాయ్ ఇప్పుడు హైదరాబాద్ చుట్టూ చెక్కర్లు కొడుతుంది. మొన్నామధ్య ఓ టివి షోకి జడ్జ్ గా ఉన్న ఆమె ఓ న్యూస్ ఛానెల్ లో వస్తున్న ఓ షోకి హోస్ట్ గా కూడా వ్యవహరిస్తుంది. ఇదిలాఉంటే ఆలితో సరదాగా షోకి రేణు దేశాయ్ ను ఇన్వైట్ చేశారు.
పవన్ ప్రియ స్నేహితుడు ఆలితో రేణు ఇంటర్వ్యూ చాలా సరదాగా సాగింది. ఇక అసలు ఇండస్ట్రీకి ఎలా వచ్చారు అన్న ఆలి ప్రశ్నకు సమాధానంగా మోడలింగ్ లో ఉన్న తనకు సినిమా హీరోయిన్ అయ్యే ఉద్దేశం లేదని కాని జగన్ (పూరి జగన్నాథ్) ముంబై వచ్చి తనని బద్రి సినిమాకు హీరోయిన్ గా తీసుకున్నారని చెప్పింది రేణు దేశాయ్. ముందు అసిస్టెంట్ డైరక్టర్, డైరక్టర్ అవ్వాలనుకున్న తనకి జగన్ చెప్పిన కథ నచ్చి సినిమా చేశా. అయితే అప్పుడు తనకి పవన్ కళ్యాణ్ ఎవరో తెలియదు సినిమా కోసం ఆరు నెలలు కలిసి పనిచేయాలి కాబట్టి ఆయన్ను ఒకసారి ముందు కలవాలని అనుకున్నా.
అప్పుడు రామానాయుడు స్టూడియోలో తొలిప్రేమ షూటింగ్ టైంలో పవన్ ను కలిశాను. ఆయన అప్పుడు చాలా కూల్ గా మాట్లాడారని అన్నది. మొత్తానికి జగన్ బలవంతం వల్లే తాను హీరోయిన్ అయ్యానని పవన్ ఎవరో తెలియ కుండా వచ్చి అతన్న్ పెళ్లి ఆడింది రేణు. అఫ్కోర్స్ ఇప్పుడు పవన్ రేణు ఎవరి దారి వారు చూసుకున్నారు. ఇప్పటికి పవన్ మీద రేణు దేశాయ్ తన అభిమానాన్ని చూపిస్తుంది.