రివ్యూ: అమ్మ రాజ్యంలో క‌డ‌ప బిడ్డ‌లు

-

టైటిల్‌: అమ్మ రాజ్యంలో క‌డ‌ప బిడ్డ‌లు
న‌టీన‌టులు: అజ్మ‌ల్‌, రాము
స‌మ‌ర్ప‌ణ‌: అంజ‌య్య‌
మ్యూజిక్‌: ర‌వి శంక‌ర్‌
సినిమాటోగ్ర‌ఫీ: జ‌గ‌దీశ్ చీక‌టి
ఎడిటింగ్‌: అన్వ‌ర్ ఆలీ
ర‌చ‌న‌: రాంగోపాల్ వ‌ర్మ – క‌రుణ్ వెంక‌ట్‌
స‌హ నిర్మాత‌: న‌ట్టి కుమార్‌
నిర్మాత‌: అజ‌య్ మైసూర్‌
ద‌ర్శ‌క‌త్వం: సిద్ధార్థ్ తాతోలు
సెన్సార్ రిపోర్ట్‌: యూ / ఏ
ర‌న్ టైం: 132 నిమిషాలు
రిలీజ్ డేట్‌: 12 డిసెంబ‌ర్‌, 2019

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ తెర‌కెక్కించిన క‌డ‌ప రాజ్యంలో అమ్మ బిడ్డ‌లు (క‌మ్మ రాజ్యంలో క‌డ‌ప రెడ్లు) సినిమా టైటిల్ ఎనౌన్స్ మెంట్ జ‌రిగిన‌ప్ప‌టి నుంచే ఎన్నో సంచ‌నాల‌కు కార‌ణ‌మైంది. ఈ సినిమా స్టిల్స్‌, టీజర్లు, ట్రైల‌ర్లు చూస్తేనే సినిమా ఏపీలో ప్ర‌ధాన ప్ర‌తిక్షాల‌ను ,ఆ పార్టీ నేత‌ల‌ను టార్గెట్‌గా చేసుకుని తెర‌కెక్కించాడ‌ని స్ప‌ష్టంగా అర్థ‌మైంది. రిలీజ్‌కు ముందే సెన్సార్ తో పాటు ఎన్నో వివాదాలు అధిగ‌మించి… ఎట్ట‌కేల‌కు రిలీజ్‌కు కొన్ని గంట‌ల ముందే సెన్సార్ కంప్లీట్ చేసుకుని ఈ రోజు రిలీజ్ అయిన ఈ సినిమా ఈ రోజు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మ‌రి ఈ సినిమాను ముందు నుంచి అభిమానించిన వాళ్ల‌కు ఈ సినిమా ఎంత వ‌ర‌కు న‌చ్చిందో మ‌న‌లోకం స‌మీక్ష‌లో చూద్దాం.

క‌థ‌:
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎన్నిక‌ల ఫ‌లితాలు ముగుస్తాయి. సీఎం జ‌గ‌న్నాథ్‌రెడ్డి టార్గెట్‌గా అసెంబ్లీలో ప్ర‌తిప‌క్ష నేత‌లు రాజ‌కీయం చేస్తూ ఉంటారు. ప్ర‌తిప‌క్షంలో వెలుగుదేశం అధినేత బాబు, మ‌న‌సేన అధినేత క‌ళ్యాణ్ ప్ర‌తి విష‌యంలో అధికార ప‌క్షంపై విమ‌ర్శ‌లు చేస్తూ ఉంటారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌తిప‌క్ష నేత బాబు త‌న రాజ‌కీయ వార‌సుడిగా త‌న కుమారుడిని నిల‌బెట్టేందుకు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నా అత‌డికి అంత సీన్ లేక‌పోవ‌డంతో బాబు పాచిక‌లు పార‌వు. ఈ క్ర‌మంలోనే బాబుకు ప్ర‌ధాన అనుచ‌రుడిగా ఉన్న ద‌యినేని ర‌మా ( అప్ప‌టి ఓ మాజీ మంత్రి క్యారెక్ట‌ర్‌) ఆ బోడ్డోడు మ‌న పార్టీని లాగేసుకుంటాడ‌ని కూడా చెపుతాడు. ఇదిలా ఉండ‌గా ఇంట‌ర్వెల్‌కు ద‌యినేని ర‌మాను విజ‌య‌వాడ‌లో కొంద‌రు న‌డిరోడ్డు మీదే హ‌త్య చేస్తారు ?
ఈ హ‌త్య‌ను చేధించేందుకు సీబీఐ ఆఫీసర్లుగా యాంక‌ర్ స్వ‌ప్న‌, క్రిటిక్ క‌త్తి మ‌హేష్ వ‌స్తారు ? ఈ హ‌త్య‌ను ఎవ‌రు ? చేశార‌నేదానిపై ప్ర‌తిప‌క్షాల నుంచి విమ‌ర్శ‌లు వ‌స్తుంటాయి. అస‌లు ద‌యినేని ర‌మాను ఎవ‌రు హ‌త్య చేశారు ? క్లైమాక్స్‌లో వ‌ర్మ ఇచ్చిన షాకింట్ ట్విస్టు ఏంటి అన్న‌దే ఈ సినిమా స్టోరీ.

సినిమా ఎలా ఉందంటే….
ప్ర‌స్తుతం ఏపీలో ఉన్న రాజ‌కీయ ప‌రిస్థితుల‌ను ఆధారంగా చేసుకుని వ‌ర్మ తెర‌కెక్కించిన ఓ సెటైరిక‌ల్ సినిమాయే అమ్మ రాజ్యంలో క‌డ‌ప బిడ్డ‌లు. కేవ‌లం రాజ‌కీయ పార్టీల నేత‌లు, వారి వార‌సులు.. వాళ్ల‌పై ప్ర‌జ‌ల్లో ఉన్న అభిప్రాయాలు, వారు ఎలా ఉంటారు ? ఏం చేస్తారు ? వారి క్యారెక్ట‌ర్లు ఎలా ఉంటాయ‌న్న‌ది చూపించ‌డంపైనే దృస్టిపెట్టిన వ‌ర్మ అస‌లు సినిమాలో క‌థ‌, క‌థ‌నాలు గాలికి వ‌దిలేశాడు. సినిమాలో మాజీ ముఖ్య‌మంత్రికి అత్యంత స‌న్నిహితుడిగా ఉన్న అయినేని ర‌మ (అప్ప‌టి ప్ర‌భుత్వంలో ఓ కీల‌క శాఖా మంత్రిని పోలిన రోల్‌)ను ఇంట‌ర్వెల్‌లో చంపేస్తాడు. ఇక సెకండాఫ్ అంతా ఆ హ‌త్య ఎవ‌రు చేశారు ? ఈ హ‌త్య‌పై ప్ర‌తిప‌క్షాలు, ఆ పార్టీల నేత‌లు ఏం చేశారు ? ఈ హ‌త్య‌కు క‌డ‌ప ఓబుల్‌రెడ్డికి, విజ‌య‌వాడ వాళ్ల‌కు లింక్ ఏంటి ? ఈ క్ర‌మంలోనే క‌థ‌ను న‌డిపాడు.

అసెంబ్లీలో అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల స‌భ్యులు పేప‌ర్లు విసురుకోవ‌డం.. తిట్టుకోవడం… స్పీక‌ర్ క్యారెక్ట‌ర్ నిద్ర‌పోవ‌డం… ప్ర‌తిప‌క్ష నేత, వెలుగుదేశం అధినేత బాబు సీరియ‌స్‌గా చూస్తుంటే.. సీఎం క‌ళ్లు పెద్ద‌వి చేసి చూస్తే ఇక్క‌డ ఎవ్వ‌రు భ‌య‌ప‌డ‌రు అన‌డం.. ప్ర‌తిప‌క్ష నేత బాబు కుమారుడు చిన‌బాబు టీవీలో సీఎం ప్ర‌మాణ‌స్వీకారం చూస్తూ ఇంట్లోకి వెళ్లి చిన‌బాబు అనే నేను ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేస్తున్నాను అని ఏడుస్తుంటే బాబు, చిన‌బాబు భార్య ర‌మ‌ణి ఓదార్చ‌డం.. చిన‌బాబు సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేసేందుకు చిన‌బాబు కుస్తీలు ప‌డుతుంటే భార్య ర‌మ‌ణి వ‌చ్చి పాలు ఇచ్చి, భ‌ర్త‌కు ట్రైనింగ్ ఇవ్వ‌డం.. ఇక మ‌న‌సేన అధినేత క‌ళ్యాణ్ ప్ర‌తి సారి ప్రెస్‌మీట్లు పెడుతూ మోడ‌లో ఎర్ర తువ్వాలు వేసుకుని.. మొఖం మీద ప‌డుతోన్న జ‌ట్టు స‌రిచేసుకుంటూ మాట్లాడ‌డం… అధికార పార్టీలో కార్య‌క్ర‌మాలు ఇవ‌న్నీ బాగా చూపించాడు వ‌ర్మ‌.

ఫ‌స్టాఫ్ వ‌ర‌కు ప్రతి కేరెక్ట‌ర్‌ను ప‌రిచ‌యం చేస్తూ.. వాళ్లు నిజ‌జీవితంలో ఎలా బిహేవ్ చేస్తారో సెటైరిక‌ల్‌గా చూపించిన వ‌ర్మ బాబు రైట్ హ్యాండ్ ద‌యినేని ర‌మ‌ను హ‌త్య చేయ‌డంతో ఇంట‌ర్వెల్ ఇస్తాడు. ఇక సెకండాఫ్ అంతా ఈ హ‌త్య కేసును చేధించ‌డం చుట్టూ తిప్పేసిన వ‌ర్మ ఈ కేసు చేధించ‌డం కోసం యాంక‌ర్ స్వ‌ప్న‌, క‌త్తి మ‌హేష్‌ను ఎంట‌ర్ చేయించ‌డం.. మ‌ధ్య‌లో పీపీ చాల్‌గా కేఏ. పాల్ కేరెక్డ‌ర్‌తో కామెడీ ఇవ‌న్నీ బాగానే ఉన్నాయి. అయితే సెకండాఫ్‌ను బాగా ల్యాగ్ చేసి బోర్ కొట్టించేశాడు. అయితే క్లైమాక్స్‌లో టీవీ 9 జాఫ‌ర్‌తో వ‌ర్మ ఇంట‌ర్వ్యూ ఉంటుంది. అప్పుడు మ‌ధ్యంత‌ర ఎన్నిక‌ల్లో 175 సీట్ల‌కు 174 సీట్లు గెలుచుకున్న సీఎం జ‌గ‌న్నాథ్‌రెడ్డికి స‌పోర్ట్‌గా మాట్లాడ‌తాడు. మీరు వ‌న్‌సైడ్‌గా మాట్లాడుతున్నార‌ని జాఫ‌ర్ అన్నా.. ఇది తాను అన‌లేద‌ని.. రాష్ట్ర ప్ర‌జ‌లే అన్నార‌ని.. ఆయ‌న నిజాయితీకి ప‌ట్టం క‌ట్టార‌ని ప‌రోక్షంగా ఈ సినిమా ద్వారా జ‌గ‌న్‌పై అభిమానం చాటుకున్నాడు.

న‌టీన‌టుల ప‌రంగా చూస్తే ఈ సినిమాలో ఏపీలో రాజ‌కీయ నాయ‌కుల‌ను పోలిన వాళ్ల‌నే అచ్చు గుద్దిన‌ట్టు దింపేశాడు. సీఎం, ప్ర‌తిప‌క్ష నేత‌, ఆయ‌న కుమారుడు, ఆ కుమారుడి భార్య‌లే కాకుండా ఆర్థిక‌మంత్రి, వైసీపీ ఫైర్‌బ్రాండ్ ఎమ్మెల్యే, మ‌రో సినిమా పార్టీ నేత‌ను చూస్తే వాళ్లు పోలిన‌ట్టే ఉన్నాయి.

ఇక టెక్నిక‌ల్‌గా నేప‌థ్య సంగీతం సినిమాను ఎలివేట్ చేసింది. సినిమాలో సీన్‌కు త‌గ్గ‌ట్టుగా సంగీతం ఉంది. మ‌ధ్య‌లో వ‌చ్చే పాట‌లు కూడా సంద‌ర్భోచితంగా ఉన్నాయి. ప‌ప్పు లాంటి అబ్బాయి, సీఎం మీద వ‌చ్చే సాంగ్‌, పాల్ మీద సాంగ్‌, ఐటెం సాంగ్ అన్ని సెట్ అయ్యాయి. ఇక సినిమాటోగ్ర‌ఫీ కూడా సినిమాకు త‌గిన‌ట్టుగా ఉంది. అన్ని క్లోజ‌ప్ షాట్లే కావ‌డంతో డార్క్ మోడ్‌లో కాస్త లైటింగ్ త‌గ్గించారు. ఆర్ట్ వ‌ర్క్ సీన్ల‌కు త‌గిన‌ట్టుగా ఉంది. ఎడిటింగ్ సెకండాఫ్‌లో బాగా లెన్దీ అయ్యింది. నిర్మాణ విలువ‌లు సినిమాకు త‌గిన‌ట్టుగా ఉన్నాయి.

ఫైన‌ల్‌గా…
ఏపీలో రాజ‌కీయ ప‌రిస్థితులు, ప్ర‌తిప‌క్షాల‌పై వ‌ర్మ ఈ సినిమాతో సెటైర్లు వేస్తాడ‌ని ముందే అంద‌రికి క్లారిటీ ఉన్నా ఫ‌స్టాఫ్ వ‌ర‌కు మెప్పించిన వ‌ర్మ సెకండాఫ్‌లో ఈ సినిమా కోస‌మే ప్ర‌త్యేకంగా ఉన్న అభిమానుల‌ను కూడా స‌రిగా మెప్పించ‌లేకపోయాడు. కేవ‌లం వ్య‌క్తుల మీద సెటైర్లు వేసేందుకే ఈ సినిమాను వాడుకున్న వ‌ర్మ‌, క‌థ‌, క‌థ‌నాల‌ను గాలికి వ‌దిలేశాడు.

పంచ్‌: వెలుగుదేశం, మ‌న‌సేన‌పై వ‌ర్మ మార్క్ సెటైర్‌

క‌డ‌ప రాజ్యంలో అమ్మ బిడ్డ‌లు రేటింగ్‌: 2 / 5

Read more RELATED
Recommended to you

Latest news