ఆర్జివి ఈసారి 10 లక్షలు ఇస్తాడట..!

-

ఎన్.టి.ఆర్ బయోపిక్ సినిమాకు పోటీగా ఆర్జివి మొదలు పెట్టబోయే లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ హడావిడి అందరికి తెలిసిందే. అప్పుడెప్పుడో పోస్టర్ తో హాట్ న్యూస్ గా మారిన రాం గోపాల్ వర్మ ఈమధ్య సినిమా కాస్టింగ్ లో చంద్రబాబుని పోలిన మనిషి వీడియోని పెట్టి సర్ ప్రైజ్ చేశాడు. ఆ సదరు వ్యక్తి వివరాలు ఓ టివి రిపోర్టర్ పంపించడంతో అతనికి చెప్పినట్టుగానే లక్ష రూపాయలు ప్రైజ్ మనీ సెండ్ చేశాడట.

ఇక ఇప్పుడు సినిమాలో కీలక పాత్ర అయిన ఎన్.టి.ఆర్ రోల్ పోశించే వ్యక్తి కోసం వేట మొదలు పెట్టాడట ఆర్జివి. ఆల్రెడీ ఓ ముగ్గురిని ఫైనల్ చేశాడట కాని ఇంకా బెటర్ గా ఉండేందుకు అది కూడా ఆడియెన్స్ కే ఆఫర్ ఇచ్చేశాడు. ఎన్.టి.ఆర్ లా కనిపించి ఆయనలా డైలాగ్స్ చెప్పగలిగే వారి వివరాలు చెబితే వారికి 10 లక్షలు ప్రైజ్ మనీ ఇస్తామని అంటున్నాడు ఆర్జివి.

అయితే ఇది చంద్రబాబుని వెతికినంత ఈజీ అయితే కాదు. ఎన్.టి.ఆర్ లా కనిపించాలి ఇంకా ఆయనలా డైలాగులు చెప్పాలి. సో ఇది కష్టం కనుకనే వర్మ దీనికి 10 లక్షల ప్రైజ్ మనీ ఆఫర్ చేశాడు. అయితే వీటి వల్ల సినిమాకు ఫ్రీ పబ్లిసిటీ దొరుకుంతుంది. వర్మ పబ్లిసిటీ స్ట్రాటజీ అందుకోవడం ఎవరి వల్లా కాదు.

Read more RELATED
Recommended to you

Latest news