క్రిస్ మస్ పోటీకి వారు సిద్ధం..!

-

ఫెస్టివల్ వచ్చింది అంటే ఆ పండుగతో పాటుగా సినిమా పండుగను తెచ్చేస్తారు. సంక్రాంతి నుండి దీపావళి వరకు చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని సినిమాలు పండుగ నాడే రిలీజ్ ఫిక్స్ చేసేలా షెడ్యూల్ చేసుకుంటారు. ముఖ్యంగా సంక్రాంతి, దసరాకి సినిమాల వెల్లువ ఎక్కువగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఆగష్టు 15, జనవరి 26, క్రిస్ మస్ కు కూడా సినిమాలు రిలీజ్ చేస్తున్నారు.

ఈ క్రమంలో ఈసారి క్రిస్ మస్ కు మూడు సినిమాలు పోటీ పడుతున్నాయి. క్రిస్ మస్ కానుకగా డిసెంబర్ 21న 3 సినిమాలు పోటీ పడుతున్నాయి. అందులో ఒకటి వై.ఎస్.ఆర్ బయోపిక్ గా వస్తున్న యాత్ర సినిమా కాగా.. మరోటి శర్వానంద్, సాయి పల్లవి జంటగా నటిస్తున్న పడి పడి లేచే మనసు. ఇక వీటితో పాటుగా వరుణ్ తేజ్, సంకల్ప్ రెడ్డి చేస్తున్న అంతరిక్షం కూడా ఇదే డేట్ న రిలీజ్ ఫిక్స్ చేసుకున్నారు.

ఈసారి క్రిస్ మస్ రేసులో అఖిల్ 3వ సినిమా మిస్టర్ మజ్ ను కూడా ఉండాల్సింది కాని పోటీ ఎక్కువవడం వల్ల ఆ సినిమా ఫిబ్రవరికి వాయిదా వేసినట్టు తెలుస్తుంది. మరి యాత్ర, అంతరిక్షం, పడి పడి లేచే మనసు సినిమాల్లో ఏ సినిమా ప్రేక్షకుల మనసు గెలుస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news