పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. హీరో రానా ప్రధాన పాత్రలలో నటించిన తాజా సినిమా భీమ్లా నాయక్. యంగ్ డైరెక్టర్ సాగర్ కే, చంద్ర ఈ సినిమా కు దర్శకత్వం వహించారు. పవర్ స్టార్ పవన్కళ్యాణ్ సరసన హీరోయిన్ గా నిత్యామీనన్ నటించగా… అలాగే సంయుక్త మీనన్ హీరో రానా సరసన నటిస్తోంది. మలయాళంలో హిట్ కొట్టిన అయ్యప్పనుమ్ కోషీయం సినిమాకు ఇది రీమేక్.
ఇక భీమ్లా నాయక్ సినిమాపై ముందు నుంచి భారీగానే అంచనాలు ఉన్నాయి. ట్రైలర్ అలాగే పోస్టర్లతో సినిమా స్థాయి పెరిగింది. ఇక ఒక్కో పాట మరింత హైప్ క్రియేట్ చేసింది. ఈ మధ్య విడుదల చేసిన ట్రైలర్ అయితే ఇంకో రేంజ్ లో ఉంది.
ఇలాంటి తరుణంలో భీమ్లా నాయక్ మూవీ రిలీజ్ అయింది. అయితే.. ఈ సినిమాపై ఎన్నడూ లేని విధంగా.. వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రివ్యూ ఇచ్చారు. భీమ్లా నాయక్ సినిమాలో పవన్ కళ్యాణ్ ఓ సునామీలా కనిపించాడంటూ ట్వీట్ చేశారు వర్మ. “భీమ్లా నాయక్ ఉరుములాంటిది.. పవన్ కళ్యాణ్ సునామీ లాంటోడు.. రానా దగ్గుబాటి, పవన్ కళ్యాణ్ నెక్ టూ నెక్ సన్నివేశాలు హైలేట్. మొత్తం మీద భీమ్లా నాయక్ సినిమా ఓ భూకంపం” అంటూ వర్మ ట్వీట్ చేశారు.
The #BheemlaNayak is like a THUNDERSTORM..@PawanKalyan is like a TSUNAMI.. @RanaDaggubati is neck to neck ..Overall it’s an EARTHQUAKE 💪💪💪
— Ram Gopal Varma (@RGVzoomin) February 25, 2022