భీమ్లా నాయక్‌ ట్రైలర్‌పై RGV సంచలన ట్వీట్‌..పవన్‌ ను తొక్కేసారు !

-

సంచనాలు, వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌ టాలీవుడ్‌ దర్శకుడు రాం గోపాల్‌ వర్మ. ఎప్పుడు ఏదో ఒక అంశంపై సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతూ.. రచ్చ చేస్తూ ఉంటారు వర్మ. ముఖ్యంగా రాజకీయ నాయకులు, సినీతారలనే టార్గెట్‌ చేస్తూ… కౌంటర్లు పేల్చుతుంటారు. ముఖ్యంగా రాజకీయ నేతల బయోగ్రఫీ లపై సినిమాలు తీస్తూ ఉంటారు వర్మ.

ఇక తాజాగా మరో వివాదాస్పద పోస్ట్ చేశాడు వర్మ. తాజాగా విడుదలైన భీమ్లా నాయక్‌ సినిమా ట్రైలర్‌ పై సంచలన వ్యాఖ్యలు చేశారు రామ్‌ గోపాల్‌ వర్మ. ఈ ట్రైలర్‌ చూసి.. సాటి పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌ గా బాధపడుతున్నానని చెప్పారు.

భీమ్లా నాయక్‌ సినిమా ట్రైలర్‌ లో మొత్తం… హీరో రానాను హైలెట్‌ గా చూపించారని సెటైర్‌ పేల్చారు. ఈ ట్రైలర్‌ లో పవన్‌ కళ్యాణ్‌ ఎక్కడా కనిపించలేదని చిత్ర బృందానికి చురకలు అంటించారు. మొత్తం రానాకే హైప్‌ ఇచ్చారని.. పవన్‌ ఫ్యాన్‌ గా తాను చాలా హర్ట్‌ అయ్యానంటూ.. తెలిపారు. ప్రస్తుతం వర్మ చేసిన ఆ ట్వీట్‌ వైరల్‌ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news