పవన్ కళ్యాణ్ విషయంలో ఆర్జీవీ పక్క స్కెచ్…!

-

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ‘పవర్ స్టార్’ సినిమా విడుదలకు సంబంధించిన విడుదల తేదిని ఫిక్స్ చేశారు. పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ మూవీ ‘తొలి ప్రేమ’ మూవీ విడుదల రోజే రిలీజ్ ఈ సినిమాను రీలీజ్ చేయాలని భావిస్తున్నారు ఆర్జీవీ.

ramgopal varma
ramgopal varmapava 

 

సంచలన సినిమాలకు దర్శకత్వం వహిస్తూ కేంద్ర బిందుగా ఉన్న రామ్ గోపాల్ వర్మ. ప్రముఖ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జీవితం ఆధారంగా సినిమా నిర్మిచబోతున్నారు. ఆర్జీవీ నిర్మంచబోతున్న పవర్ స్టార్ సినిమా గురించి అందరికి తెలిసిందే. గత కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేసిన వర్మ సినిమా గురించి వరుస అప్ డేట్స్ ఇస్తూ సినిమాపై ఆశలు పెంచుతతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ విడుదల చేసిన అన్ని పోస్టర్స్ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు ఆర్జీవీ. ఇటు సినీ రంగంలోనూ, రాజకీయ వర్గాల్లో సినిమాపై ఆసక్తితో పాటు పలు అనుమానాలు, ఉత్కంఠ నెలకొందని సినీ పరిశ్రమలో సమాచారం.

అయితే నటుడు పవన్ కళ్యాణ్ బయోపిక్ కాదంటూనే అచ్చం హిరో పవన్ లాంటి రూపమున్న యాక్టర్ ను పెట్టి రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పనులు శరవేగంగా పూర్తి చేస్తున్నారు. సినిమాను విడుదల చేయడానికి డేట్ ఫిక్స్ చేశారు. పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ మూవీ ‘తొలిప్రేమ’ విడుదల చేసిన రోజే ‘పవర్ స్టార్’ సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని సినీ ఇండస్ట్రీలో టాక్.

తొలిప్రేమ సినిమాతోనే పవన్ కళ్యాణ్ తన నటనను నిరూపించుకుని అధిక సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్నారు. కరుణాకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను 24 జూలై 1998 తేదీన విడుదల చేశారు. ఇప్పుడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘పవర్ స్టార్’ సినిమాను రిలీజ్ చేయాలని భావిస్తున్నారని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news