నట్టి కుమార్‌…ఓ సోల్లుగాడు, పానకంలో పుడక – RGV స్ట్రాంగ్ కౌంటర్‌

-

టాలీవుడ్‌ నిర్మాత నట్టి కుమార్‌ కు వివాదస్పద దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. తనపై నిన్న నట్టి కుమార్‌ చేసిన ఆరోపణలపై ఓ వీడియోను ఆర్జీవీ విడుదల చేశారు. ఈ వీడియోలో వర్మ మాట్లాడుతూ.. నట్టి కుమార్‌ ఓ సోల్లుగాడు, పానకంలో పుడక లాంటోడు అంటూ ఓ రేంజ్‌ లో సెటైర్‌ పేల్చారు.

తన మా ఇష్టం సినిమా విడుదల వాయిదాకు నట్టి కుమార్‌ కారణం కాదని.. దానికి ఇతరు కారణాలు ఉన్నాయని వర్మ చెప్పాడు. తాను రూ.5 కోట్లు మోసం చేసానని నట్టి చెబుతున్నాడని.. దానిపై లీగల్‌ గా వెళతానంటూ సమాధానం ఇచ్చారు.

రెండు రోజుల నుంచి తనను నట్టి కుమార్‌.. డిస్టర్భ్‌ చేస్తున్నాడని.. తన గురించి ఇక మాట్లాడబోనని చెప్పాడు. ఎప్పుడు ప్రెస్‌ మీట్లు పెట్టి.. ఇలాగే… సోల్లు వాగుతాడని నట్టి కుమార్‌ పై ఫైర్‌ అయ్యారు. మా ఇష్టం సినిమా లెస్బియన్‌ కు సంబంధించిన మూవీ… అందుకే..విడుదల చేసేందుకు థియేటర్లు ముందుకు రావడం లేదని చెప్పారు వర్మ.

Read more RELATED
Recommended to you

Latest news