ఇజ్రాయిల్ పై మరోసారి ఉగ్రదాడి జరిగింది. ఇజ్రాయిల్ కమర్షియల్ సిటీ టెల్ అవీవ్ లో ఈ దాడి చోటు చేసుకుంది. గురువాారం రాత్రి ఈ దాడి జరిగింది. బార్ లు , కేఫ్ లతో బిజీగా ఉన్న డైజెన్‌గాఫ్ స్ట్రీట్‌లో పలు ప్రాంతాల్లో దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా… 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. ముందుగా గాయపడిన 10 మందిని స్థానికంగా ఉన్న ఇచిలోవ్ ఆసుపత్రి తరలించగా అందులో ఇద్దరు మరణించారని అధికారులు తెలిపారు. ఈ దాడిలో మరణించిన వారికి, గాయపడిన వారికి తన సానుభూతి వ్యక్తం చేశారు ఇజ్రాయిల్ ప్రధాని నఫ్తాలీ బెన్నెట్. ఈ దాడికి పాల్పడిన వారిని విడిచిపెట్టబోం అని… దీని వెనక ఉన్నవాళ్లంతా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఉగ్రదాడికి పాల్పడిన వ్యక్తి కోసం పోలీసులు, భద్రత బలగాలు గాలింపు చేపట్టాయి. గత వారంలో ఇజ్రాయిల్ లో ఇది రెండో ఉగ్రదాడి. అంతకుముందు వారం బ్నీ బ్రాక్ నగరంలో ఒక సాయుధుడు కాల్పులు జరిపాడు, ఐదుగురు మరణించారు.
יום חמישי לב תל אביב אזרחים נמלטים מהירי pic.twitter.com/5Ty7us2hsH
— חיים גולדברג (@haim_goldberg) April 7, 2022