బ్రేకింగ్ : 9 గంటలుగా సీబీఐతోనే రియా.. అరెస్ట్ తప్పదా ?

-

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసు రియా చక్రవర్తి మెడకు చుట్టుకుంతున్నట్టే ఉంది. ఈరోజు పొద్దున్న ముంబైలోని డీఆర్డీఓ భవనంలో సీబీఐ ఎదుట విచారణకు హాజరయిన రియాని ఇంకా ప్రశ్నిస్తోంది సీబీఐ టీమ్. కొద్దిసేపటి క్రితం ముంబై పోలీసుల టీమ్ ఒకటి లోపలికి వెళ్ళింది. ఈ టీమ్ లో భారీగా లేడీ కానిస్టేబుల్స్ ఉండడంతో ఆమె అరెస్ట్ తప్పదు అనే వాదన వినిపిస్తోంది.

నిజానికి సీబీఐ వర్గాల సమాచారాన్ని బట్టి రియాని ఈరోజు అరెస్ట్ చేయకపోవచ్చని చెబుతున్నారు. అయితే ఈ కేసుతో సంబంధం ఉన్న అందరినీ సీబీఐ వేరువేరుగా వేరు వేరు చోట్ల ప్రశ్నిస్తోంది. సుశాంత్ ఫ్రెండ్ సిద్దార్ధను కొద్దిసేపటి క్రితం డీఆర్డీఓ భవన్ కి తీసుకువచ్చింది సీబీఐ టీమ్. అయితే డ్రగ్స్ డీలర్స్ తో మాట్లాడానని చెబుతోన్న రియా తనకు మాత్రం అలవాటు లేదని చెబుతోంది. కేవలం సుశాంత్ కోసమే వారితో మాట్లాడానని ఆమె చెబుతోంది. కుటుంబంతో సుశాంత్ కి అంత మంచి సంబంధాలు లేవని కూడా చెబుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news