ఆలియా-రణ్​వీర్​ల ప్రేమకథ.. ‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్‌ కహానీ’ టీజర్‌ రిలీజ్‌

-

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్.. బీ టౌన్ స్టార్ హీరో రణ్​వీర్ సింగ్.. హిందీ సినిమా ఇండస్ట్రీలోనే సూపర్ ఫేమస్ కరణ్ జోహర్.. ఈ ముగ్గురు కలిస్తే ఇంకేముంది ఓ బ్లాక్ బస్టర్ బంపర్ హిట్ సినిమా పక్కా. తాజాగా రిలీజ్ అయిన రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ సినిమా టీజర్ చూస్తుంటే అది నిజమే అని అనిపించక మానదు. ఏడేళ్ల తర్వాత కరణ్ జోహర్ డైరెక్షన్​లో వస్తున్న ఈ సినిమా టీజర్​ను తాజాగా మేకర్స్‌ విడుదల చేశారు. ఒక్క డైలాగ్‌ లేకుండా టీజర్‌ మొత్తం మ్యూజిక్​తోనే నింపేశారు.

కరణ్‌ తన స్టైల్‌ ఆఫ్ కామెడీని, ఎమోషన్స్‌ను పుష్కలంగా దట్టించినట్లు టీజర్‌ చూస్తే తెలిసిపోతోంది. ప్రేమ, భావోద్వేగం, సంఘర్షణ వంటి మూడింటి కలయికలో ఈ సినిమా రూపొందింది. కుటుంబ కథా నేపథ్యంలో మంచి ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. ధర్మేంద్రా, జయా బచ్చన్‌ కీలకపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా జులై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news