జ‌బ‌ర్ద‌స్త్‌కు రోజా గుడ్ బై…!

-

జ‌బ‌ర్ద‌స్త్ అంటే రోజా.. రోజా అంటే జ‌బ‌ర్ద‌స్త్ అన్న‌ట్టుగా ఉంది… అటు రాజ‌కీయాల్లో ఎంత ఫుల్ బిజీగా ఉన్నా.. న‌గ‌రి నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా కూడా రోజా జ‌బ‌ర్ద‌స్త్‌ను వ‌ద‌ల్లేదు.. ఇక్క‌డే ఆమె ఫుల్ పాపుల‌ర్ అయ్యింది. అలాంటి రోజా ఇప్పుడు జ‌బ‌ర్ద‌స్త్‌ను వ‌దిలేయ‌డం ఏంట‌ని అనుకుంటున్నారా ?  దీనికి ఆమెను అడిగితే ఆమె చెప్పిన ఆన్స‌ర్ చూస్తేనే ఆమెకు ఈ షో మీద ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది. తాజాగా ఓ మీడియా మిత్రుడు రోజాతో మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు ?  ఏపీఐఐసీ చైర్మ‌న్‌గా బిజీగా ఉన్నారు. మీరు జ‌బ‌ర్ద‌స్త్ ప్రోగ్రామ్‌లో స్టేజ్ మీద మోడ‌ర‌న్ డ్రెస్సుల్లో డ్యాన్సులు వేయ‌డం ఏంట‌ని ప్ర‌శ్నించాడు. దీంతో ఫైర్‌బ్రాండ్ బిరుదును సార్థ‌కం చేసుకునేలా అంతెత్తున ఫైర్ అయ్యింది.

త‌న‌కు మీడియా అంటే చాలా గౌర‌వం అంటూనే మా నాయ‌కుడు, సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డికి ఈ విష‌యంలో లేని బాధ మీకు ఎందుకు అని ఆమె ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. త‌న‌క ఎమ్మెల్యేగా ప్ర‌జ‌లు వారి హృద‌యాల్లో మంచి స్థానం ఇచ్చార‌ని.. తాను ఇక్క‌డ జ‌డ్జ్‌గా ఉన్న విష‌యం మా నాయ‌కుడికి తెలుసంటూనే ఆ మీడియా మిత్రుడికి చుర‌క‌లు వేసింది. అక్క‌డితో ఆగ‌కుండా ఎన్టీఆర్ రాజ‌కీయాల్లోకి వ‌చ్చి సినిమాలు చేయ‌లేదా ?  బాల‌య్య రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాక కూడా సినిమాల్లో న‌టించ‌డం లేదా ? ప‌వ‌న్‌, చిరు రాజ‌కీయాల్లో ఉండి సినిమాలు చేయ‌డం లేదా ?  వారికో న్యాయం.. నాకో న్యాయ‌మా ? అని ప్ర‌శ్నించింది.

ఇక త‌న‌ను ఎవ‌రెన్ని ట్రోల్స్ చేసినా ప‌ట్టించుకోన‌ని.. జ‌బ‌ర్ద‌స్త్‌, రాజ‌కీయాలు త‌న‌కు రెండు క‌ళ్ల‌ని చెప్పిన రోజా.. తాను దేనిని వ‌దులుకోన‌ని చెప్పింది. ఇక రాజ‌కీయాల్లో తాను రెండు సార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయాన‌ని.. అప్పుడు ఆర్థిక‌ప‌ర‌మైన ఇబ్బందులు ఎదురైతే తాను యాక్టింగ్ చేయ‌డం వల్లే నిల‌దొక్కుకున్నాన‌ని చెప్పింది. అలాగే న‌ట‌న‌తో త‌న‌కు ఎంతో సంతృప్తి ఉంటుంద‌ని చెప్పిన రోజా.. ప్ర‌జ‌ల కోసం దేనినైనా వ‌దులుకునేందుకు తాను ఎప్పుడూ సిద్ధ‌మేన‌ని కూడా రోజా తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news