బాల‌కృష్ణ సినిమాలో విల‌న్ పాత్రకు.. రోజా ఇదే మాట చెప్పింద‌ట‌..!

-

నంద‌మూరి బాలకృష్ణ కథానాయకుడిగా 105వ చిత్రం `రూలర్‌`. ప్ర‌స్తుతం ఈ సినిమా విడుదలకి ముస్తాబవుతోంది. అయితే ఈ చిత్రం త‌ర్వాత బాల‌య్య.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే నందమూరి అభిమానులకు పండగే. గతంలో వరుస ఫ్లాపుల్లో ఉన్న బాలయ్యకు ‘సింహా’ వంటి బ్లాక్ బస్టర్‌తో మంచి సక్సెస్ అందించాడు బోయపాటి. ఆ తర్వాత వీళ్లిద్దరి కాంబోలో వచ్చిన ‘లెజెండ్’ మూవీ అంతకు మించిన సక్సెస్ సాధించింది.

దీంతో సహజంగానే ఈ మూడో ప్రాజెక్టుపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలో నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రను రోజా చేయనున్నట్టు కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. దాదాపు లేడీ విలన్ గానే ఆమె కనిపించనుందని చెప్పుకున్నారు. రోజాతో సంప్రదింపులు జరిపిన మాట నిజమేనట. అయితే బాలకృష్ణ సినిమాలో చేయడం తనకి అంగీకారమేగానీ, ఈ తరహా పాత్రను మాత్రం చేయనని రోజా స్పష్టం చేసిందట. మరి ఈ పవర్ఫుల్ పాత్ర కోసం ఎవరిని ఎంపిక చేసుకుంటారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version