మంచు విష్ణుతో శృంగార తార “స‌న్నీలియోన్‌” రొమాన్స్‌ !

-

మంచు విష్ణుకు.. టాలీవుడ్ లో మంచి క్రేజ్ వున్న సంగతి తెలిసిందే. ఈమధ్య సినిమాలు చేయని మంచు విష్ణు తాజాగా ఓ అదిరిపోయే అప్ డేట్ ఇచ్చాడు. మంచు మోహన్ బాబు ఆశీస్సులతో.. అవ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో “గాలి నాగేశ్వరరావు” అనే సినిమా చేయబోతున్నట్లు తాజాగా తన ట్విట్టర్ వేదికగా అధికారిక ప్రకటన చేశాడు మంచు విష్ణు బాబు.

ఈ చిత్రానికి ఈ షాన్ సూర్య దర్శకత్వం వహిస్తుండగా… కథ స్క్రీన్ ప్లే తో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా కోన వెంకట్ పని చేస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ గా చోట కె నాయుడు పనిచేస్తుండగా భాను మరియు నందు డైలాగ్స్ అందిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీత స్వరాలు అందిస్తున్నారు.

జి.నాగేశ్వరరెడ్డి స్క్రిప్ట్ అందిస్తున్నారు. అయితే.. తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్ డేట్‌ వచ్చింది. ఈ మూవీలో సన్నీలియోనీ నటిస్తోంది. రేణుక అనే పాత్రలో తాను నటిస్తున్నట్లు స్వయంగా సన్నిలియోనీ తన సోషల్‌ మీడియాలో ప్రకటించింది. మంచు విష్ణు సినిమాలో నటించడం తనకు చాలా ఆనందంగా ఉందటూ పేర్కొంది.

https://www.instagram.com/p/CaymZjpjce_/?utm_source=ig_web_copy_link

Read more RELATED
Recommended to you

Exit mobile version