పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండేళ్ళ తర్వాత ‘వకీల్ సాబ్’ సినిమాతో రీఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ లో బిగ్ బి అమితాబ్ బచ్చన్ నటించిన పింక్ సినిమా కి అఫీషియల్ రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. హిందీలో 23 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన పింక్ 100 కోట్ల పైనే వసూళ్ళని రాబట్టింది. ఇక ఇదే సినిమాని కోలీవుడ్ లో బోని కపూర్ అజిత్ హీరోగా నిర్మించారు. అక్కడ కూడా దాదాపు 200 కోట్ల వరకు వసూళ్ళు సాధించింది. తమిళ వెర్షన్ లోను మాతృకలో ఉన్నట్టుగానే పెద్దగా మార్పులు చేయకుండా నిర్మించారు. ఇక అమితాబ్ లాగా అజిత్ కూడా అద్భుతంగా నటించాడు. అందుకే ఈ సినిమా కోలీవుడ్ లోను సూపర్ హిట్ గా నిలిచింది.
దాంతో ఈ సినిమాని బోనీకపూర్ తెలుగులో మళ్ళీ నిర్మించాలనుకున్నారు. అందుకే దిల్ రాజు తో కలిసి వకీల్ సాబ్ ని నిర్మిస్తున్నారు. అయితే హిందీ తమిళం కంటే తెలుగులోనే ఎక్కువ బడ్జెట్ పెట్టి నిర్మించడం విశేషం. ఇక ఈ సినిమాకి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇంతకముందు కేవలం రెండు సినిమాల అనుభవమున్న వేణు శ్రీ రామ్ పవన్ కళ్యాణ్ ని డైరెక్ట్ చేయడంతో అందరిలోను ఆసక్తి నెలకొంది. ఇక ఈ సినిమా పవర్ స్టార్ కెరీర్లో 26వ గా నిర్మితమవుతుండగా డైరెక్టర్ కి మూడో సినిమానే.
అయితే బాలీవుడ్ కథలో లేని కొన్ని కీలక మార్పులు చేర్పులు తెలుగు వర్షన్ లో చేసినట్టు చిత్ర యూనిట్ ముందు నుంచి చెప్పుకొస్తున్నారు. పవన్ సరసన హీరోయిన్ ఉంటుందని, ఇద్దరికి సాంగ్స్ ఉంటాయని అలాగే పవర్ స్టార్ కోసం ప్రత్యేకంగా ఫైట్స్ పెట్టినట్టు ప్రచారం జరిగింది. అవన్ని నిజాలేనని పవన్ రీ ఎంట్రీ మూవీ కాబట్టి అందుకో తెలుగులో ఆయన కి ఉన్న మార్కెట్, మాస్ ఫాలోయింగ్ …హీరోయిజం ..ఇలా అన్ని లెక్కలేసుకొనే కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ని జోడించారని తాజా సమాచారం.
అయితే ఇలా రొమాంటిక్ సాంగ్ పెట్టడానికి కారణం అమితాబ్ ఏజ్ కి పవన్ కళ్యాణ్ ఏజ్ కి చాలా వ్యత్యాసం ఉంది. అందులోను బాలీవుడ్ లో కొన్ని కథలని సాంగ్స్ ఫైట్స్ లేకపోయినా చూస్తారు. కాని ఇక్కడ మనకి కొన్ని మార్కెట్ లిమిట్స్ గాని ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ గాని పరిగణలోకి తీసుకోవాలి. అందుకే పవన్ కళ్యాణ్ కి ఉన్న ఇమేజ్ ని బట్టి కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ని యాడ్ చేశారట. అందుకే పవన్ కళ్యాణ్ కి శృతిహాసన్ కి ఒక రొమాంటిక్ సాంగ్ ఉందట. లాక్ డౌన్ తర్వాతా ఆ సాంగ్ తో పాటు బ్యాలెన్స్ వర్క్ కంప్లీట్ చేస్తారట.