అవగాహన లేని ఆలోచనలో, నిర్లక్ష్యంతో కూడిన పనులో, భయం లేని బ్రతుకులో… ఒక్క కారణం చాలు, తద్వారా జరిగే ఒక్క తప్పు చాలు… కరోనా కట్టలు తెంచుకోవడానికి.. పాజిటివ్ లెక్కలు మారిపోవడానికి! మరి ఒక చిన్న తప్పుకే అంత జరిగితే… ఒక భారీ తప్పు జరిగితే ఫలితం ఎలా ఉంటుంది? ప్రస్తుతం సూర్యపేటలో పరిస్థితిలా ఉంటుంది!
అవును.. మంగళవారం ఒక్క రోజులోనే సూర్యాపేటలో 26 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ లెక్కలతో తెలంగాణ ప్రభుత్వం ఒక్కసారిగా ఉలిక్కిపడిందనే చెప్పుకోవాలి. దీంతో ఈ జిల్లాపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన పరిస్థితి! ఈ క్రమంలో అసలు ఈ వ్యవహారానికి కారణం ఏమిటి? ఇంతకాలం ప్రశాంతంగా ఉన్న జిల్లాలో.. ఇంత కట్టుదిట్టమైన లాక్ డౌన్ నేపథ్యంలో అసలు ఎలా వచ్చింది అని ఆరాలు తీయడం మొదలుపెట్టారు పోలీసులు… దీంతో ఇందులో ఒక ప్రభుద్దుడు – ఒక వేశ్య ల పాత్ర ఉందని తేలిందంట!
తాజాగా పాజిటివ్ గా తేలిన వ్యక్తిని అధికారులు, పోలీసులూ తమదైన శైలిలో ఆరా తీయగా… ఇటీవల తానో వేశ్య వద్దకు వెళ్లానని చెప్పాడంట సదరు వ్యక్తి! దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారంట సూర్యపేట జిల్లాల అధికారులు! వెంటనే ఆ వేశ్య వివరాలు సేకరించి ఆమెను పరీక్షించగా.. ఆమెకు కూడా పాజిటివ్ అని తేలింది! అనంతరం సమాధానాలు చెప్పడం ఆమె వంతు అవ్వడంతో… “ఈ మధ్య కాలంలో సుమారు నలభై మంది వరకూ నా వద్దకు వచ్చారు” అనిచావుకబురు చల్లగా చెప్పిందంట ఆ మహిళ! దీంతో.. ఆ నలభై మంది లెక్క బయటకు తీసి, వారందరిని పరీక్షించటంతో పాటు… వారి కాంటాక్టుల్ని కూడా సేకరిస్తున్నారంట అధికారులు!
ఆ మహిళ వల్ల ఆ వ్యక్తికి వచ్చిందా.. ఆ వ్యక్తి వల్ల మహిళకు వచ్చిందా అనే సంగతి కాసేపు అటుంచితే… ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా అలాంటి కక్కుర్తి పనులు చేయడమేలా అని ప్రశ్నిస్తున్నారట జనాలు!!