తగ్గుతున్న పసిడి ధరలు ..వెండి కూడా …!

-

దేశ వ్యాప్తంగా కరోనా ప్రభావం తో బంగారం డిమాండ్ క్రమంగా పడిపోతు వస్తుంది. దీనితో భారీగా ధరలు తగ్గుతున్నాయి. నాలుగు రోజుల నుంచి బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. బుధవారం హైదరాబాద్ మార్కెట్ లో బంగారం 22 క్యారెట్లు పది గ్రాములకు 30 రూపాయలు తగ్గింది. 40,400 రూపాయలుగా ఉంది బంగారం. 24 క్యారెట్ల బంగారం ధర విషయానికి వస్తే 20 రూపాయలు తగ్గింది.

ప్రస్తుతం 44,100 రూపాయలుగా ఉంది బంగారం. విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం స్వల్పంగా తగ్గింది. 22 క్యారెట్లు పది గ్రాములకు 30 రూపాయలకు తగ్గింది. 40,400 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు 20 రూపాయల వరకు తగ్గింది. 44,100 రూపాయలకు దిగి వచ్చింది. దేశరాజధాని ఢిల్లీలో కూడా బంగారం ధరలు తగ్గాయి.

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 20 రూపాయల వరకు తగ్గింది. 44,450 రూపాయల వద్దకు చేరుకుంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 50 రూపాయల వరకు తగ్గింది. 41,850 రూపాయలు గా ఉంది. వెండి ధరల విషయానికి వస్తే… కేజీ వెండి ధర 42 వేల మార్కు నుంచి దిగింది. 41,650 రూపాయలు గా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news