రూటు మార్చిన కాజ‌ల్‌.. అలాంటి సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్

కాజ‌ల్ అగ‌ర్వాల్ అంటే చ‌లాకీగా ఎప్పుడూ త‌న పాత్ర‌ల‌ను హుషారుగా మ‌లిచే హీరోయిన్‌. ఈ ముద్దుగుమ్మ ఇండ‌స్ట్రీకి వ‌చ్చి చాలా రోజుల‌వుతోంది. స్టార్ హీరోయిన్‌గా చ‌క్రం తిప్పింది. ఇప్ప‌టికే తెలుగు, మ‌ళ‌యాల అగ్ర హీరోలంద‌రితో న‌టించి మెప్పించింది. బాలీవుడ్లో హీరోయిన్ గా ట్రై చేసినా పెద్ద‌గా స‌క్సెస్ కాలేక‌పోయింది.

 

అయితే కాజల్ అగర్వాల్’ఎప్పుడైతే పెళ్లి చేసుకుందో అప్పటినుండి తన సినిమాల సెలక్షన్ ను చేంజ్ చేసిన‌ట్టు తెలుస్తోంది. కథల ఎంపికలో కొత్తగా ఆలోచిస్తోందని, క్యారెక్టర్ల విషయంలో కొత్త‌గా ఉండేలా చూస్తోంద‌ని స‌మాచారం.

నిజానికి కాజ‌ల్ అంటే ఎక్కువ‌గా గ్లామ‌ర్ పాత్ర‌లే చేసింది. ఆమెకు లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో అవకాశాలు వచ్చినా చేయడానికి ఎప్పుడూ ఆసక్తి చూపించలేదు. ఇప్పుడు మాత్రం గ్లామ‌ర్ కాకుండా క్యారెక్ట‌ర్‌కు ఇంపార్టెన్స్ ఉండే పాత్ర‌లే చేస్తానంటోంది. అందుకే త్వరలోనే ఓ ఫిమేల్ ఓరియంటెడ్ సినిమా చేయ‌బోతోంద‌ని తెలుస్తోంది. త‌న క్యారెక్ట‌ర్ న‌చ్చ‌డంతో ఈ సినిమాకు ఓకే చెప్పింద‌ట‌. ఇక నుంచి ఇలాంటి సినిమాలు చేస్తానంటూ చెప్తోంది. ఎంతైనా ఇలాంటి సినిమాలు చేయ‌డం మంచిదే క‌దా.