RRR: బాహుబలి 2 రికార్డ్ బ్రేక్ చేసిన ఆర్ఆర్ఆర్

-

దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ ‘ ఆర్ఆర్ఆర్’. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ట్రిపుల్ ఆర్ మార్చి 25 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. బాహుబలి తరువాత రాజమౌళి దర్శకత్వంతో వస్తున్న భారీ మల్టీ స్టారర్ సినిమా కావడంతో అందరిలోనూ… భారీగా అంచానాల ఉన్నాయి. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా… తారక్ కొమురం భీంగా నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్లు అజయ్ దేవ్ గన్, అలియా భట్ ఉండటం కూడా సినిమాపై భారీ హైప్ పెంచింది. 

ఇదిలా ఉంటే విడుదలకు ముందే ట్రిపుల్ ఆర్ రికార్డ్ లు బ్రేక్ చేస్తోంది. ఇప్పటికే నైజాం అడ్వాన్స్ బుకింగ్స్ లో టాప్ గా ఉన్న ‘ భీమ్లానాయక్’ సినిమాను ట్రిపుల్ ఆర్ క్రాస్ చేసింది. భీమ్లా నాయక్ మించి అడ్వాన్స్ బుకింగ్స్ నమోదయ్యాయి. తాజాగా మరో రికార్డ్ ను కూడా ట్రిపుల్ ఆర్ బ్రేక్ చేసింది. ఏకంగా భారతీయ చిత్రాల రికార్డ్ ను బద్దలు కొట్టింది. అమెరికా ప్రీమియర్ ప్రీ సేల్ లో ట్రిపుల్ ఆర్ …2.5 మిలియన్ డాలర్ల మార్క్ ను దాటేసి 3 మిలియన్ డాలర్ల వైపు దూసుకెళ్తోంది. దీంతో బాహుబలి-2 ( 2.4 మిలియన్ డాలర్లు) రికార్డ్ బ్రేక్ అయింది. ఈ రోజు ( మార్చ్ 24) అమెరికాలో ట్రిపుల్ ఆర్ ప్రిమియర్ షోలు వేయనున్నారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో వీకెండ్ వరకు అన్ని బుకింగ్స్ పూర్తయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news