‘ఆర్ఆర్ఆర్’ సక్సెస్ సెలబ్రేషన్స్.. పార్టీ చేసుకున్న మూవీ యూనిట్ సభ్యులు..

-

దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన విజ్యువల్ వండర్ ‘ఆర్ఆర్ఆర్’ మేనియా ఇంకా నడుస్తోంది. దేశవ్యాప్తంగా ఈ చిత్రాన్ని చూసేందుకు ప్రజానికం థియేటర్స్ వద్దకు వస్తోంది. ఇకపోతే ఈ చిత్ర విజయాన్ని తమ విజయంగా తెలుగు వారు భావిస్తున్నారు. తెలుగోడి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పడమే కాదు.. తెలుగు ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన ఘనత రాజమౌళికి దక్కుతుందని జక్కన్నను కొనియాడుతున్నారు.

 

ఈ క్రమంలోనే సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేశారు ‘ఆర్ఆర్ఆర్’ మూవీ యూనిట్ సభ్యులు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. సదరు వీడియోలో మూవీ యూనిట్ సభ్యులు హ్యాపీగా పార్టీ చేసుకోవడం మనం చూడొచ్చు. చక్కగా అందరికీ భోజనాలు ఏర్పాటు చేసినట్లు వీడియోలో స్పష్టమవుతోంది. చిత్రంలో అల్లూరి సీతారామరాజు పాత్ర పోషించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఆయన వైఫ్ ఉపాసన ఈ సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నారు.

డైరెక్టర్ రాజమౌళితో చరణ్ సరదాగా ముచ్చటించారు. తన క్యూట్ డాగ్ ను కూడా ఈ సెలబ్రేషన్స్ కు తీసుకొచ్చాడు రామ్ చరణ్. ఇక ఉపాసన ‘ఆర్ఆర్ఆర్’ మూవీని కూకట్ పల్లి భ్రమరాంబ థియేటర్‌లో చూసి ఎంజాయ్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. హ్యాపీగా పేపర్లు చింపి గాల్లోకి విసురుతూ థియేటర్లో సినిమా చూస్తూ ఎంజాయ్ చేసిన ఉపాసన.. ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ సక్సెస్ సెలబ్రేషన్స్ లోనూ పాల్గొంది. మొత్తంగా ‘ఆర్ఆర్ఆర్’ మూవీ యూనిట్ సభ్యులు సినిమా విడుదలైన ఒక్క రోజులోనే సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఈ సెలబ్రేషన్స్‌కు జూనియర్ ఎన్టీఆర్ హాజరు కానట్లున్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news