రాజమౌళి RRR లో ఈ సీన్ కి థియేటర్ లు దద్దరిల్లాల్సిందే !!

‘బాహుబలి’ వంటి భారీ బ్లాక్ బస్టర్ తరువాత ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా RRR. మొట్టమొదటిసారి టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా మరియు నందమూరి వారసులు రామ్ చరణ్- ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న నేపథ్యంలో సినిమాపై టాలీవుడ్ ఇండస్ట్రీలో అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఈ ఏడాది జులై చివరి లో విడుదల కానున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు సగం పైగా పూర్తైనట్లు సమాచారం.

సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ నటిస్తుండగా …కొమరం భీం పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నాడు. ఇటువంటి నేపథ్యంలో తాజాగా ఈ సినిమా గురించి ఒక న్యూస్ టాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. అదేమిటంటే జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ కలిసి బ్రిటిష్ వారితో చేసే పోరాట సన్నివేశం ఫైట్ సీన్ సినిమాకే హైలెట్ అవుతుందని కచ్చితంగా ఈ సీన్ కి థియేటర్లో దద్దరిల్లి పోయె రెస్పాన్స్ వస్తుందని ఇండస్ట్రీలో గట్టిగా వార్తలు వినపడుతున్నాయి.

 

ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన సీత పాత్రలో బాలీవుడ్ నటి ఆలియా భట్ నటిస్తుండగా ఎన్టీఆర్ పక్కన బ్రిటిష్ యువతి ఒలీవియా నటిస్తోంది. అంతేకాకుండా ఈ సినిమాలో సముద్రఖని అజయ్ దేవగన్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ‘బాహుబలి’ సినిమా హిట్ అవ్వడంతో రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా తో పాటు అంతర్జాతీయ స్థాయిలో సినిమా ప్రేక్షకులకు అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి.