RRR MOVIE : ‘ఆర్ఆర్ఆర్’ ఓటిటీ డేట్ రిలీజ్..

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం ప్రేక్షకుల ముందకు వచ్చి వారి విశేష ఆదరణ పొందుతోంది. మన దేశంలోనే కాదు విదేశాల్లోనూ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తోంది. భారీ అంచనాలతో మార్చి నెల 25న విడుదలైన పిక్చర్.. అంచనాలకు మించిన విజయాన్ని అప్పుడే సాధించి, రికార్డుల వేటలో తలమునకలైంది.

సోషల్ మీడియాలోనే కాదు బయట కూడా ‘ఆర్ఆర్ఆర్’ మేనియా కొనసా..గుతోంది. మన దేశంలో మాత్రమే కాదు.. విదేశాల్లోనూ సినిమా బాగా ఆడుతోంది. మూడు గంటల పాటు ప్రేక్షకులను థియేటర్ లో కట్టి పడేశాడు రాజమౌళి అని జనాలు చర్చించుకుంటున్నారు.

ఇది ఇలా ఉండగా.. తాజాగా ఆర్ఆర్‌ఆర్‌ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్‌ వచ్చింది. ఈ సినిమా ఓటీటీ డేట్‌ఫిక్స్‌ అయింది. ఆర్ఆర్‌ఆర్‌ మూవీ మే 20 వ తేదీన జీ 5 లో విడుదల కానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల అయింది. దీంతో ఆర్‌ఆర్‌ఆర్‌ ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు.