కీరవాణికి బ‌ర్త్‌డే పోస్ట‌ర్‌పై ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ హింట్ ఇచ్చిన రాజ‌మౌళి..!

-

ప్ర‌పంచ‌మంతా ఎంత‌గానో ఎదురు చూస్తున్న ప్ర‌ముఖ మూవీ ఆర్ఆర్ఆర్ ( RRR Movie ). ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి తీస్తున్న మూవీ కావ‌డంతో అంచ‌నాలు ఆక‌శాన్ని తాకుతున్నాయి. ఇక ఇందులో తొలిసారి ఇద్ద‌రు స్టార్ హీరోలు రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌లు న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే రిలీజ్ అయిన టీజ‌ర్లు, పోస్ట‌ర్లు భారీ హైప్ ను పెంచేశాయి. అయితే మూవీ రిలీజ్‌డేట్ పై ఇప్ప‌టికీ అనుమానాలు ఉన్నాయి.

ఆర్ఆర్ఆర్ | RRR Movie

కాగా ఈరోజు టాలీవుడ్ లోనే స్టార్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అయిన కీరవాణిది పుట్టినరోజు. ఈ సంద‌ర్భంగా మూవీ టీమ్ ఆయ‌న‌కు స్పెష‌ల్ విషెస్ చెబుతూ ఆర్ఆర్ఆర్ యూనిట్ టీమ్ ఓ అద్భుత‌మైన పోస్టర్ ను విడుద‌ల చేసింది. ఇందులో కీరవాణి వయోలిన్ వాయిస్తూ కనిపిస్తున్నారు.

అయితే ఇక్క‌డే ఓ అస‌లు విష‌యం దాగుంది. ఈ పోస్ట‌ర్‌లోనే మ‌రో ఆసక్తికరమైన విష‌యం చెప్పాడు జ‌క్క‌న్న‌. ఇప్పటి వ‌ర‌కు ఈ మూవీ విడుద‌ల తేదీల‌పై అనేక సందేహాలు ఉండ‌గా.. ఈ పోస్టర్ పైన 13 అక్టోబర్ 2021 అనే డేట్ ఉంది. ఇది ఎప్ప‌టి నుంచో మూవీ విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు చెబుతున్న డేట్ ఇప్పుడు కూడా రావ‌డంతో అన్ని అనుమానాలు పటాపంచలై పోయాయి. ఆరోజే సినిమా రాబోతోంది.

Read more RELATED
Recommended to you

Latest news