11.11.11.. R. R. R ఓపెనింగ్ సెరిమనీ టీజర్.. రాజమౌళి మొదలు పెట్టాడోచ్..!

-

బాహుబలి సినిమా తెలుగు జాతి గర్వపడేలా తెలుగు సినిమా స్థాయిని పెంచేలా వచ్చింది. తెలుగు సినిమా మీద చిన్నచూపు చూసే ఉత్తరాధి వారికి తెలుగు సినిమా దమ్ము చూపించాడు రాజమౌళి. 2000 కోట్లు వసూళు చేసిన మొదటి ఇండియన్ సినిమాగా బాహుబలి ప్రభంజనం సృష్టించింది. ఇక బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమా చరణ్, ఎన్.టి.ఆర్ మల్టీస్టారర్. సినిమా ఎనౌన్స్ మెంట్ నుండి భారీ అంచనాలు ఏర్పరచుకున్న ఈ ట్రిపుల్ ఆర్ ప్రాజెక్ట్ ముహుర్తం ఫిక్స్ చేశారు.

దీనికి సంబందించిన టీజర్ వదిలార్. 11..11..11 అనేది కాస్త ఆర్. ఆర్. ఆర్ గా మారడం.. వెనుక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ జస్ట్ ఎనౌన్స్ మెంట్ టీజరే ఇలా ఉంటే ఇక ఈ మల్టీస్టారర్ సినిమా ఇంకెలా ఉంటుందో అని ఇప్పటి నుండో అభిమానులు అంచనాలు పెంచేసుకున్నారు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో చరణ్, ఎన్.టి.ఆర్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం విశేషం. ఒక స్టార్ తోనే అద్భుతాలు చేయగల రాజమౌళి ఇద్దరు సూపర్ స్టార్స్ తో ఎలాంటి సినిమా చేస్తాడో అని మెదడుకి పదును పెడుతున్నారు. మరి ఓపెనింగ్ సెరిమనీతోనే ఊపందుకునే టీజర్ వదిలిన రాజమౌళి సినిమా ఎలా తీస్తాడో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version