R R R ఫ్యాన్స్‌కు భారీ షాక్ … రిలీజ్ లేన‌ట్టే..!

-

బాహుబలి లాంటి భారీ హిట్టు తర్వాత రాజమౌళి తీస్తున్న సినిమా R R R ( వర్కింగ్ టైటిల్ మాత్రమే ) . ఈ సినిమాలో ఇద్ద‌రు టాలీవుడ్ యంగ్ క్రేజీ హీరోలు మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్ చరణ్, యంగ్‌టైగ‌ర్ జూనియర్ ఎన్టీఆర్ కథానాయకులుగా నటిస్తూ ఉండడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. బాహుబ‌లి సీరిస్ రెండు సినిమాల త‌ర్వాత రాజ‌మౌళి డైరెక్ట్ చేస్తోన్న సినిమా కావ‌డంతో అంచ‌నాలు మామూలుగా లేవు. దేశం మొత్తం ఇప్పుడు ఈ సినిమా కోసం ఎంతో ఆస‌క్తితో వెయిట్ చేస్తోంది.

ఈ సినిమాలో చరణ్ మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ ఆదిలాబాద్ ఏజెన్సీకి చెందిన గోండు జాతి ప్ర‌జ‌ల ఆధార్య‌దైవం కొమరం భీం పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాని వచ్చే ఏడాది జూలై 30న విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. ఎప్పుడో గ‌తేడాది ఎనౌన్స్‌మెంట్ వ‌చ్చిన‌ప్పుడే రాజ‌మౌళి ఈ విష‌యం చెప్పారు.

అయితే ఈ సినిమా షూటింగ్ జ‌రుగుతోన్న తీరు చూస్తుంటే అనుకున్న టైంకి R R R విడుదలవ్వడం కష్టమే అనిపిస్తుంది. ఎందుకంటే సినిమా షూటింగ్ సమయంలో ఇద్దరు హీరోలకి ఒకసారి గాయాలు అయ్యాయి. దీనితో షూటింగ్ వాయుదా పడుకుంటూ వచ్చింది. ఆ త‌ర్వాత రామ్‌చ‌ర‌ణ్ నిర్మాత‌గా సైరా సినిమా షూటింగ్‌, ప్ర‌మోష‌న్ల‌లో బిజీగా ఉండి ఈ సినిమా షూటింగ్‌కు రాలేదు.

ఇప్పుడు చ‌ర‌ణ్ వ‌చ్చాడ‌నుకుంటే.. ఎన్టీఆర్‌కు హీరోయిన్ దొర‌క‌డం లేదు. ఎన్టీఆర్ ప‌క్క‌న స‌రైన హీరోయిన్ కోసం రాజ‌మౌళి ఏకంగా ఆరేడు నెల‌లుగా ఎన్ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నా సెట్ కావ‌డం లేదు. ఇది పిరియాడిక్ సినిమా కావడంతో టెక్నికల్ గా కూడా సమయం పట్టే అవకాశం ఉంది. ఇన్ని సమీకరణలు చూస్తుంటే సినిమాఅనుకున్న సమయానికి విడుదల అవ్వడం అన్నది కొంచం డౌట్ గానే అనిపిస్తుంది. లేట్ అయితే 2021 సంక్రాంతి కానుక‌గా సినిమా రిలీజ్ అవ్వొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version