ఆర్ఆర్ఆర్ సంచలనం..16 రోజుల్లోనే రూ.1,000 కోట్లకు పైగా వసూలు.. 

-

జక్కన్న తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.రాంచరణ్ జూనియర్ ఎన్టీఆర్ తో తీసిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్లను వసూలు చేసుకుంది.ఇంతకుముందు రూ. 1,000 కోట్లు వసూలు చేసిన చిత్రాలు భారత సినీ చరిత్రలో రెండే ఉన్నాయి.

 

అవి దంగల్, బాహుబలి 2.ఈ విషయాన్ని సినిమా లిస్ట్ఈ విషయాన్ని సినిమా అనలిస్ట్ మనోబల విజయబాలన్ తన ట్విట్టర్ లో ప్రకటించారు.రూ.1,000 కోట్లు దాటి వసూలు చేసిన మూడు చిత్రాల్లో రెండు సినిమాలు రాజమౌళి వే ఉండడం, తన సినిమాకు కమర్షియల్ సక్సెస్ తీసుకురాగల ఆయన నైపుణ్యానికి నిదర్శనం అని చెప్పుకోవాలి.

విజయేంద్ర ప్రసాద్ కధ రాయగా, ఆయన కుమారుడు రాజమౌళి ఈ సినిమాకు దర్శకత్వం వహించడం తెలిసిందే. అల్లూరి సీతారామరాజు పాత్రలోలో రామ్ చరణ్, కొమరం భీమ్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ పోషించారు.నిర్మాత డివివి దానయ్య ఈ చిత్ర నిర్మాణం కోసం రూ.450 కోట్లను ఖర్చు చేశారు.మార్చి 25న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా 16 రోజుల్లోనే రూ.1,000 కోట్లు దాటి కలెక్షన్లు వసూలు చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news