RRR.. మీరు పెట్టేదే టైటిల్ కావొచ్చు..!

రాజమౌళి డైరక్షన్ లో ఎన్.టి.ఆర్, రాం చరణ్ కలిసి నటిస్తున్న సినిమా ఆర్.ఆర్.ఆర్. మెగా నందమూరి మల్టీస్టారర్ గా భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమా టైటిల్ గా ఆర్.ఆర్.ఆర్ అని వదిలి పెట్టాడు జక్కన్న. ఆర్.ఆర్.ఆర్ మొదట ఇంత సెన్సేషన్ అవుతుందని అనుకోలేదు ఇదే టైటిల్ కాని రిలీజ్ అయ్యే ఒక్కో భాషలో ఒక్కోలా ఈ ఆర్.ఆర్.ఆర్ అబ్రివేషన్ ఉంటుందని అన్నాడు.

అభిమానులు ఊరుకుంటారా :

రాజమౌళి అలా చెప్పడమే ఆలస్యం.. తమ క్రియేటివిటీ మొత్తం బయటకు తీసి ఆర్.ఆర్.ఆర్ కు సరిపోయే టైటిల్ ఆలోచించి ఆ టైటిల్ ను ఆర్.ఆర్.ఆర్ చిత్ర యూనిట్ కు పంపిస్తున్నారు. ఇలా నేషనల్ వైడ్ గా ఈ టైటిల్స్ వచ్చాయట. అందుకే నిర్మాత డివివి దానయ్య ఈ టైటిల్స్ అన్నిటితో ఓ పోస్టర్ వదిలాడు.

ఆర్.ఆర్.ఆర్ అసలు టైటిల్ ఏంటి.. అది ఇప్పటికి కన్ ఫ్యూజనే.. అయితే దానయ్య మాత్రం ఇంకా మీ దగ్గర టైటిల్స్ ఉంటే పంపించండి అని ఆడియెన్స్ ను కోరుతున్నాడు. ఏమో టైటిల్ నచ్చితే మీరు పెట్టేదే ఫైనల్ కావొచ్చని ఊరిస్తున్నాడు. మొత్తానికి ఆర్.ఆర్.ఆర్ కు ఈ విధంగా భీభత్సమైన పబ్లిసిటీ వచ్చేస్తుంది. అయినా మన పిచ్చి గాని రాజమౌళి సినిమాకు పబ్లిసిటీ అవసరమా చెప్పండి. రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఆర్.ఆర్.ఆర్ ప్రస్తుతం ఓ చిన్న షెడ్యూల్ హైదరాబాద్ లో చేస్తుంది.