ఆరెక్స్ పాప దానికి సిద్ధమైంది..!

-

ఆరెక్స్ 100 సినిమాతో తెలుగులో సూపర్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్న బ్యూటీ పాయల్ రాజ్ పుత్. ఆ సినిమా హిట్ తో అమ్మడికి తెలుగులో వరుస ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం రవితేజ డిస్కో రాజా సినిమాతో పాటుగా ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తున్న పాయల్ రాజ్ పుత్ బెల్లంకొండ శ్రీనివాస్ తో ఐటం సాంగ్ కు రెడీ అయ్యింది. తేజ డైరక్షన్ లో బెల్లంకొండ శ్రీనివాస్ చేస్తున్న సీత సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది.

అయితే స్పెషల్ ఎట్రాక్షన్ గా పాయల్ రాజ్ పుత్ ఐటం సాంగ్ ప్లాన్ చేశాడు దర్శకుడు తేజ. సినిమా తను అనుకున్న మీటర్ లో తెరకెక్కించడంలో సిద్ధహస్తుడైన తేజ పర్ఫెక్ట్ టైమింగ్ తో పాయల్ ఐటం సాంగ్ పెడుతున్నాడట. ఈ సాంగ్ తో ఆమెకు.. సినిమాకు ఎంతో ప్లస్ అవుతుందని అంటున్నారు. సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా తన సినిమా బడ్జెట్, హీరోయిన్స్ విషయంలో కాంప్రమైజ్ అవని బెల్లంకొండ శ్రీనివాస్ పాయల్ ను ఐటం సాంగ్ లో వాడేస్తున్నాడు. మరి ఈ సాంగ్ లో పాయల్ ఎలా రెచ్చిపోయిందో చూడాలంటే సినిమా వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news