జస్ట్‌ ఇమాజిన్‌ : రాజమౌళి టీమ్‌ ‘మహాభారత’.. అందరి కలలు నెరవేరేలా

రాజమౌళి ఈ పేరు చెబితే రికార్డులు తమ స్థానం గురించి ఆలోచిస్తాయి. తాము సేఫ్‌గా ఉన్నామా అనేది చూసుకుంటుంటాయి. అది రాజమౌళి అలియాస్‌ జక్కన్న స్టామినా.. పెద్ద హీరోల నుండి కుర్ర హీరోలవరకు ఆయనతో సినిమా చెయ్యాలని కలలు కంటుంటారు. ప్రస్తుతం రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్‌ పనుల్లో బిజీగా ఉన్నారు. జూనియర్‌ ఎన్టీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా టీజర్‌ విడుదల చేసే పనిలో ఉన్నారు. గతంలో ఓ విలేకరి మహాభారతం సినిమా గురించి అడగ్గా… అదే తన చివరి చిత్రమవుతుందని తెలిపారు జక్కన్న. మరి నిజంగా మహాభారతంలో ఉన్న మఖ్య పాత్రలకు ఏ నటులు సెట్టవుతారో మనమూ ఓ అంచనా వేద్దామా..? (తెలుగు హీరోలకు ప్రాముఖ్యత ఇస్తూ.. అందరి కలలు నెరవేరేలా..)


కృష్ణుడు – మహేష్‌ బాబు
ధుర్యోధనుడు – ఎన్టీఆర్‌
ధ‌ర్మ‌రాజు – గోపీచంద్‌
భీముడు – ప్రభాస్‌
అర్జునుడు – రామ్‌ చరణ్‌
నకులుడు – నాని
సహదేవుడు – శర్వానంద్‌
అభిమన్యుడు – అఖిల్‌ అక్కినేని

ద్రోణాచార్యుడు – రజనీకాంత్‌
భీష్ముడు – చిరంజీవి

కర్ణుడు – విజయ్‌ దేవరకొండ
దుశ్శాసనుడు – దగ్గుపాటి రానా
శకుని – నాజర్‌

ద్రౌపది – దీపిక పడుకొనె
కుంతి – రమ్యకృష్ణ

పోలా అదిరి పోలా..

మీరైతే ఎవరిని సెలెక్ట్‌ చేస్తారో మా ఫేస్‌బుక్‌ పేజీలో కామెంట్‌ చేయగలరు..

గతంలో అంటే 2017 లోనే మహాభారతం సినిమా క్యాస్ట్‌ ఇదే అంటూ ఓ ఆర్టిస్టు వేసిన బొమ్మ‌ల‌ను కింద చూడొచ్చు… అయితే అందులో ప్రభాస్‌ మినహా తెలుగు న‌టులెవ్వ‌రూ లేరు. అప్పటికి బాహుబలి విడుదల కాలేదు మరి..

Image Source: Internet / credits to original creator