రెండు పెద్ద సినిమాలు కొన్ని రోజుల వ్యధిలో విడుదలైతే ముందుగా ప్రస్తావనకు వచ్చేది రెండిటి వసూళ్ల అంశమే. టాలీవుడ్‌లో ఒకేసారి రెండు భారీ అంచనాలు ఉన్న సినిమాలు, పెద్ద హీరోల సినిమాలు వచ్చిన ప్రతిసారి ఇదే అంశం ప్రముఖంగా చర్చకు వస్తుంటుంది. ఇక ఇప్పుడు గత శుక్రవారం ప్రభాస్, సుజీత్ కలిసి చేసిన ‘సాహో’ చిత్రం విడుదలై రికార్డ్ ఓపెనింగ్స్ రాబట్టింది. మూడు రోజుల్లో ఈ సినిమా విపరీతమైన నెగిటివ్ టాక్‌తో కూడా ఏకంగా రూ. 294 కోట్ల గ్రాస్ వసూళ్లు కొల్లగొట్టింది.
మిగతా రాష్ట్రాల సంగతి ఎలా ఉన్నా ఏపీ, తెలంగాణాల్లోని అనేక ఏరియాల్లో నాన్ బాహుబలి రికార్డ్స్ క్రియేట్ చేసింది. సాహో దెబ్బతో కొన్ని ఏరియాల్లో బాహుబలి 2 రికార్డులే బ్రేక్ అవ్వడంతో అందరూ షాక్ అవుతున్నారు. ప్లాప్ టాక్‌తో ఈ వసూళ్లు రావడంతో ఎవ్వరికి ఏం అతుపట్టడం లేదు. మొదటిరోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 42 కోట్ల షేర్, నైజాంలో రెండు రోజుల్లో రూ.14.42 కోట్లు రాబట్టింది.
నైజాంలో 3 రోజులకు రూ.20 కోట్ల షేర్ దాటేస్తే… హిందీలో మూడు రోజులకు సినిమా ప్లాప్ అని వాళ్లు ప్రచారం చేసినా రూ.80 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇక ఈ వసూళ్లు త్వరలో రాబోతున్న మెగాస్టార్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘సైరా’ బీట్ చేయగలదా అనే డిస్కషన్స్ ఇప్పటి నుండే మొదలయ్యాయి. మెగాస్టార్ అభిమానులు మాత్రం బాహుబలి 2 రికార్డులే బ్రేక్ చేస్తుందన్న ధీమాతో ఉన్నారు. కానీ మేకర్స్ మాత్రం సాహో రికార్డులు బీట్ చేస్తుందా ? లేదా ? ఈ పీరియాడికల్ డ్రామా ప్రేక్షకులు ఎంత వరకు కనెక్ట్ చేసుకుంటారన్న ఆందోళనతో ఉన్నట్టే తెలుస్తోంది.