సోష‌ల్ మీడియాలో.. `సాహో` క‌థ‌..!

-

‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజీత్ దర్శకత్వం వహించిన భారీ యాక్షన్ థిల్ల‌ర్ చిత్రం `సాహో`. ఈ చిత్రంలో యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌, శ్రద్ధ కపూర్ జంట‌గా న‌టిస్తున్నారు. దాదాపు 350 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్క‌బోయే ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మించారు. బాలీవుడ్ నటులు నీల్ నితిన్ ముఖేష్, అరుణ్ విజయ్, జాకీ ష్రాఫ్, వెన్నెల కిషోర్, మహేష్ మంజ్రేకర్, చంకీ పాండే, త‌దిత‌రులు ప్రధాన పాత్రలలో పోషిస్తున్నారు.

Saaho Movie Story in Social Media
Saaho Movie Story in Social Media

అలాగే భారీ అంచ‌నాలు నెల‌కొన్న ఈ చిత్రం ఆగ‌ష్టు 30న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. విడుద‌ల‌కు ఇంకా రెండు రోజులు మాత్ర‌మే ఉన్న టైమ్‌లో సాహో స్టోరీ లీక్ అయింది. ఇప్పుడు ఇదే సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఇటీవ‌ల విడుద‌ల అయిన ట్రైల‌ర్ ద్వారా.. ఈ చిత్రంలో ప్ర‌భాస్ ఓ పోలీస్ అధికారి. అతని తండ్రి ఒక జెట్ ప్యాక్ సృష్టించిన శాస్త్రవేత్త. అయితే సినిమా అంతా రెండు వేల కోట్ల రాబరీ చుట్టూ తిరుగుతుందని తెలుస్తోంది.

అదే విధంగా ఈ రెండు వేల కోట్లు దొంగ‌లించేది ప్ర‌భాసే. ట్విస్ట్ ఏంటంటే ఈ రాబ‌రీ కేసును ఇన్వెస్టికేష‌న్ చేసేది కూడా ప్ర‌భాసే. మ‌రి ప్ర‌భాస్ ఈ రాబ‌రీ ఎందుకు చేశార‌న్న విష‌యం ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో తెలుస్తుంది. ఈ ఫ్లాష్ బ్యాక్ వెన‌క ఎవ‌రు ఊహించని విధంగా బలమైన కథ ఉంటుంద‌ట‌. ఇదే క‌థ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో విసృతంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఈ క‌థ ఎంత వ‌ర‌కు ప్రేక్ష‌కుల‌కు రీజ్ అవుతుందో మ‌రి కొన్ని గంట‌ల వ‌ర‌కు వేచి చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news