మెగా హీరో.. మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ హీరోగా కిశో తిరుమల డైరక్షన్ లో వచ్చిన సినిమా చిత్రలహరి. కళ్యాణి ప్రియదర్శన్, నివేదా పేతురాజ్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు. డిఎస్పి మ్యూజిక్ అందించిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వస్తుంది. యూఎస్ లో ఆల్రెడీ ప్రీమియర్స్ పూర్తయ్యాయి అక్కడ నుండి చిత్రలహరి ఫస్ట్ రిపోర్ట్ వచ్చింది.
సక్సెస్ కోసం ఎదురుచూసే విజయ్ కథే చిత్రలహరి. లహరితో ప్రేమలో ఉన్న విజయ్ అనూహ్యంగా ఆమెకు దూరమవుతాడు. ఈలోగా చిత్ర పరిచయమై అతనికి సక్సెస్ కు అందించాలని అనుకుంటుంది. కాని విజయ్ తయారు చేసిన యాక్సిడెంట్ అలర్ట్ సిస్టెం అనుకున్న టైం కు సరిగా పనిచేయదు. అందుకే అతనే ప్రయోగం చేయాలని ర్యాష్ డ్రైవింగ్ చేస్తాడు. పోలీసులు కేస్ ఫైల్ చేసి కోర్ట్ లో హాజరుపరుస్తాడు. విజయ్ జడ్జ్ తో వాదించి కేసు నుండి సురక్షితంగా బయటకు వస్తాడు.
దర్శకుడు కిశోర్ తిరుమల ఓ మెసేజ్ తో కూడా సినిమాగా చిత్రలహరి చేశాడు. హీరో, హీరోయిన్ కెమిస్ట్రీ.. సినిమా కథ, కథనాలు ఇంకస్త గ్రిప్పింగ్ గా ఉండి ఉంటే బాగుండేదని అంటున్నారు. ఫస్ట్ హాఫ్ మొత్తం సరదాగా సాగించినా సెకండ్ హాఫ్ ల్యాగ్ అయ్యిందట. ఫైనల్ రిపోర్ట్ మాత్రం మెగా ఫ్యాన్స్ కు నచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. మరి అసలు రిపోర్ట్ ఏంటన్నది ఈరోజు సాయంత్రం వరకు తెలుస్తుంది.