మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ కిశోర్ తిరుమల కాంబినేషన్ లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన సినిమా చిత్రలహరి. కళ్యాణి ప్రియదర్సి, నివేదా పేతురాజ్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకు డిఎస్పి మ్యూజిక్ అందించాడు. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.
కథ :
విజయ్ (సాయి తేజ్) లైఫ్ లో అసలు సక్సెస్ అనేదే లేని వ్యక్తి. తాను ఏ ప్రయత్నం చేసినా అది ఫెయిల్యూర్ రిజల్ట్ ఇస్తుంది. ఈ క్రమంలో లహరి (కళ్యాణి ప్రియదర్శి) ని చూసి ఇష్టపడిన విజయ్ ఆమె ప్రేమ పొందటంలో కూడా ఫెయిల్ అవుతాడు. ఈ టైంలో స్వేచ్చ(నివేదా పేతురాజ్) విజయ్ కు పరిచయమవుతుంది. అతను తయారు చేసిన యాక్సిడెంట్ అలర్ట్ సిస్టెం ప్రయోగం సక్సెస్ చేసుకోవాలని అనుకుంటాడు. అయితే అందులో కూడా ఫెయిల్ అవడంతో విజయ్ ఏం చేశాడు.. చివరకు విజయ్ జీవితంలో ఎలా సక్సెస్ సాధించాడు.. అన్నది సినిమా కథ.
ఎలా ఉందంటే :
కథ విషయంలో దర్శకుడు చాలా సింపుల్ లైన్ రాసుకున్నాడు. ఇక స్క్రీన్ ప్లే కూడా పర్వాలేదు అన్నట్టుగా ఉంది. అయితే ఫస్ట్ హాఫ్ మొత్తం సరదాగా సాగినా సెకండ్ హాఫ్ అక్కడక్కడ వెనుకపడ్డది. క్లైమాక్స్ కూడా పెద్దగా మెప్పించలేదు. సినిమాలో సాయి తేజ్ నటనకు మంచి మార్కులు పడతాయి.
హీరో, హీరోయిన్ కెమిస్ట్రీ కూడా పెద్దగా వర్క్ అవుట్ కాలేదని చెప్పొచ్చు. సినిమా కథ, కథనాల్లో దర్శకుడు కొనసాగించిన పంథా గొప్పగా అనిపించలేదు. హీరో క్యారక్టరైజేషన్ విషయంలో కొద్దిగా పర్వాలేదు. కాని అది సినిమాకు ప్లస్ అయ్యేలా కథనం రాసుకోవడంలో ఫెయిల్ అయ్యాడు. అయితే తేజూ మునుపటి ఫ్లాప్స్ తో పోల్చుకుంటే ఇది బెటరే అని చెప్పొచ్చు.
మెగా ఫ్యాన్స్, యూత్ ఆడియెన్స్ కు రీచ్ అయ్యే దాన్ని బట్టి ఈ సినిమా ఫలితం ఆధారపడి ఉంటుంది. సాయి ధరం తేజ్ సిన్సియర్ ఎఫర్ట్ సినిమాకు ప్లస్ అయ్యింది. దర్శకుడు ఇంకాస్త గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే రాసుకుని ఉంటే బాగుండేది.
ఎలా చేశారు :
సాయి తేజ్ విజయ్ పాత్రలో జీవించేశాడని చెప్పొచ్చు. తేజ్ లో పరిణితి వచ్చిందని విజయ్ పాత్రలో అతని పర్ఫార్మెన్స్ చూస్తే తెలుస్తుంది. అతని వరకు పర్ఫెక్ట్ గా చేశాడు. హీరోయిన్స్ కళ్యాణి ప్రియదర్శి, నివేదా పేతురాజ్ కూడా బాగానే చేశారు. కళ్యాణి క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంది. అయితే హీరో హీరోయిన్ కెమిస్ట్రీ విషయంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడు. పోసాని, సునీల్, వెన్నెల కిశోర్, సుదర్శన్ పాత్రలన్ని అలరించాయి.
ఇక టెక్నికల్ టీం విషయానికొస్తే.. కార్తిక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. కెమెరా వర్క్ చాలా నీట్ గా ఉంది. డిఎస్పి మ్యూజిక్ ఇంప్రెస్ చేసింది. సినిమాలో రెండు సాంగ్స్ బాగున్నాయి. బిజిఎం కూడా బాగానే ఇచ్చాడు దేవి. డైరక్టర్ కిశోర్ తిరుమల కథ అంత గొప్పగా ఏం రాసుకోలేదు. కథనం కొద్ది మేరకు ఓకే అనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్ :
సాయి తేజ్
మ్యూజిక్
సినిమాటోగ్రఫీ
మెసేజ్
మైనస్ పాయింట్స్ :
అక్కడక్కడ ల్యాగ్ అవడం
క్లైమాక్స్
బాటం లైన్ : స్వేచ్చ.. లహరిల మధ్య ఓ విజయ్ కథ..!
రేటింగ్ : 2.5/5