నాని ‘జెర్సీ’ ట్రైలర్.. ఇంతపెద్ద ప్రపంచంలో ఇప్పటివరకు జడ్జ్ చేయనిది నా కొడుకు ఒక్కడే..!

-

నాచురల్ స్టార్ నాని గౌతం తిన్ననూరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా జెర్సీ. క్రికెట్ నేపథ్యంతో వస్తున్న ఈ సినిమాలో నాని సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. ఏప్రిల్ 19న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ట్రైలర్ కొద్ది నిమిషాల క్రితం రిలీజైంది. క్రికెటర్ అవ్వాలన్న ఆశతో కెరియర్ ప్రారంభించి లైఫ్ లో అన్ని కోల్పోయిన అర్జున్ కథే ఈ జెర్సీ. 36 ఏళ్ల వయసులో మళ్లీ క్రికెట్ ఆడి అతనేంటో ప్రపంచానికి చెబుతాడు.

సినిమా ట్రైలర్ చూస్తే నిజంగా మాటల్లేవని అనొచ్చు. నాని పడిన కష్టానికి తగిన ప్రతిఫలం ట్రైలర్ చూస్తే అందిందని చెప్పొచ్చు. ఇక డైలాగ్స్ అయితే దుమ్ముదులిపేస్తున్నాయి. ఇంతపెద్ద ప్రపంచంలో ఇప్పటివరకు జడ్జ్ చేయనిది నా కొడుకు ఒక్కడే.. వాడి విషయంలో నేను కొంచం తగ్గినా తట్టుకోలేను.. అనే డైలాగ్ ప్రతి ఒక్క మధ్యతరగతి తండ్రికి తగులుతుంది. జెర్సీ ట్రైలర్ సూపర్ హిట్ ఇక సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news