మామని ఇలా కూడా ఫాలో అవుతున్న తేజూ.. ఫారిన్ అమ్మాయితో డేటింగ్..!

-

మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ కెరియర్ మొదట్లో హిట్ అందుకోగా ఇప్పుడు వెనుక పడ్డాడు. తిక్క నుండి తేజ్ ఐలవ్యూ వరకు వరుసగా డబుల్ హ్యాట్రిక్ ఫ్లాపులు అందుకున్న సాయి ధరం తేజ్ ప్రస్తుతం చిత్రలహరి సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను కిశోర్ తిరుమల డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా కోసం తన లుక్ మార్చుకునేందుకు సాయి ధరం తేజ్ కొన్నాళ్లు అమెరికా వెళ్లాడు.

అతను వెళ్లింది తన మేకోవర్ కోసమే అనుకోగా కొందరు మాత్రం తన ప్రేయసి కోసం అక్కడకి వెళ్లాడని అంటున్నారు. తిక్క సినిమాలో నటించిన లారిసా బొనెసి కోసమే తేజూ ఫారిన్ వెళ్లాడని. ఆమెతో తేజూ డేటింగ్ లో ఉన్నాడని ఇండస్ట్రీ టాక్. తిక్క నుండి వీరి మధ్య వ్యవహారం నడుస్తుందట. ఈ విషయంలో కూడా పవన్ ను ఫాలో అవుతున్నాడు తేజూ.

సినిమాలతో పవన్ ను ఇమిటేట్ చేస్తున్న సాయి ధరం తేజ్ ప్రేయసి విషయంలో అతన్నే ఫాలో అవుతున్నాడని అంటున్నారు. తీన్ మార్ సినిమా టైంలో అన్నా లెజినోవాతో పరిచయం పెళ్లికి దారి తీసింది. మరి పవన్ రూట్ లోనే లారిసాని సాయి ధరం తేజ్ పెళ్లాడుతాడా లేదా అన్నది చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version