రాజమౌళి డైరక్షన్ లో రాం చరణ్, ఎన్.టి.ఆర్ కలిసి చేస్తున్న మల్టీస్టారర్ మూవీ ఆర్.ఆర్.ఆర్. ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ షూటింగ్ చేసుకుంటున్న ఈ సినిమా నుండి పోలీస్ సెట్ లీక్ అవడం జరిగింది. రాజమౌళి తన సినిమాల విషయంలో ఎలాంటి లీకులు జరుగకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అలాంటిది మొన్నమధ్య ఆర్.ఆర్.ఆర్ సెట్ ఒకటి లీక అవగా ఇప్పుడు ఏకంగా పోలీస్ స్టేషన్ సెట్ లీక్ అయ్యింది.
ఈ లీకుల పట్ల జక్కన్న చాలా సీరియస్ గా ఉన్నాడని తెలుస్తుంది. ఇక ఈ పోలీస్ స్టేషన్ సెట్ అవడం వల్ల సినిమా కథ మీడియాలో చెక్కర్లు కొడుతున్న కథే అని ఫిక్స్ అవుతున్నారు. రాం చరణ్ బ్రిటీష్ ప్రభుత్వంలో పోలీస్ గా కనిపిస్తుండగా ఎన్.టి.ఆర్ బందిపోటు దొంగగా కనిపిస్తాడట. బాహుబలి లాంటి సినిమా నుండి ఎలాంటి పిక్స్ లీక్ అవకుండా జాగ్రత్త పడిన రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ విషయంలో మాత్రం షాకులు మీద షాకులు తింటున్నాడు.