వ్యవస్థ పునాదులే కరెప్ట్ అయినప్పుడు అందరు కరెప్టే.. సాయి తేజ్ రిపబ్లిక్ టీజర్ అదుర్స్..!

మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ హీరోగా ప్రస్థానం ఫేమ్ దేవా కట్టా డైరక్షన్ లో వస్తున్న సినిమా రిపబ్లిక్. మరోసారి పొలిటికల్ బ్యాక్ డ్రాప్ మూవీతో వస్తున్న దేవా కట్టా ఈ సినిమాతో మరోసారి తన సత్తా చాటాలని చూస్తున్నాడు. రాజకీయ పార్టీలు వాటి పవర్ మీద హీరో క్యారక్టర్ తో ప్రశ్నిస్తూ.. మార్పు తెచ్చేలా చేసే ప్రయత్నంగా ఈ రిపబ్లిక్ వస్తుంది. ఇక లేటెస్ట్ గా ఈ సినిమా టీజర్ రిలీజైంది. టీజర్ తోనే సినిమాపై అంచనాలు పెంచారు దేవా కట్టా.

Sai Dharam Tej Republic Movie Teaser Released

ప్రజాస్వామ్యం అంటే ఓటు హక్కో.. అరిచే హక్కో అనే భమలో ఉన్నాం.. కాని కట్టకుండానే కూలిపోతున్న వ్యవస్థలే ఆ ప్రజాస్వామ్యానికి పునాదులని తెలియకుండా ఇంకా ఫ్యూడల్ వ్యవస్థలోనే బ్రతుకుతున్నాం అంటూ చెప్పిన డైలాగ్ అదిరిపోయింది. ఇక టీజర్ చివర్లో వ్యవస్థ పునాదులే కరెప్ట్ అయినప్పుడు అందరు కరెప్టే సర్ అంటూ చెప్పిన డైలాగ్ కూడా బాగుంది. పవర్ ఫుల్ స్టోరీ.. పవర్ ఫుల్ డైలాగ్స్ తో వస్తున్న రిపబ్లిక్ సినిమా సాయి తేజ్ కెరియర్ లో ప్రత్యేకమైన సినిమా అవుతుందని చెప్పొచ్చు. జూన్ 2న రిలీజ్ ప్లాన్ చేసిన రిపబ్లిక్ టీజర్ మాత్రం సినిమాపై అంచనాలు పెంచింది.